సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Salman khan: బాధలో భాయిజాన్‌!

ABN, First Publish Date - 2022-10-01T19:48:15+05:30

ఎన్నో చిత్రాలకు సల్మాన్‌ ఖాన్‌కు డూప్‌గా చేసిన సాగర్‌ పాండు కన్ను మూశారు. శుక్రవారం జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడి జిమ్‌ ట్రైనర్‌ ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నో చిత్రాల్లో సల్మాన్‌ ఖాన్‌(Salman khan)కు డూప్‌గా (Doop artist)చేసిన సాగర్‌ పాండే (Sagar pandey is no more)కన్ను మూశారు. శుక్రవారం జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడి జిమ్‌ ట్రైనర్‌ ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. సాగర్‌ పాండే మరణం పట్ల సల్మాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్ర్భాంతి లోనయ్యారు. సెట్‌లో సాగర్‌ పాండేతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి హార్ట్‌ బ్రేకింగ్‌ ఎమోజీని జత చేశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించాడు. ‘‘ఇంతకాలం నాతో ఉన్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా సాగర్‌ భాయ్‌’ అని ట్వీట్‌ చేశారు. 



సాగర్‌ పాండే ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గడ్‌లో జన్మించారు. నటుడు కావాలని ముంబై చేరుకున్నారు. సల్మాన్‌కు డూప్‌గా 50కి పైగా చిత్రాల్లో నటించారు. అలాగే సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘భజరంగీ భాయిజాన్‌’, ‘ట్యూబ్‌లైట్‌’, దబాంగ్‌ 1, 2, 3 చిత్రాల్లో నటించారు. సల్మాన్‌ఖాన్‌లాగే ఆయన కూడా బ్యాచ్‌లర్‌ అని, కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ఆ విషయం తెలుసుకున్న సల్మాన్‌ఖాన్‌ ఆదుకున్నారని పలు ఇంటర్వ్యూల్లో సాగర్‌ పాండే తెలిపారు. 


Updated Date - 2022-10-01T19:48:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!