Viral Photo: ఈ ఫొటోలో ఉన్న బాలుడు.. ఇప్పుడు ఓ స్టార్ హీరో.. అతడెవరో గుర్తుపట్టగలరా..?
ABN , First Publish Date - 2022-05-18T16:37:42+05:30 IST
అలీఖాన్ పటౌడీ కుటుంబ వారసులుగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి తమకంటూ గుర్తింపు పొందిన నటులు సైఫ్ అలీఖాన్

అలీఖాన్ పటౌడీ కుటుంబ వారసులుగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి తమకంటూ గుర్తింపు పొందిన నటులు సైఫ్ అలీఖాన్, సబా అలీఖాన్. అయితే మరో వారసురాలు సభా అలీఖాన్ మాత్రం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ పటౌడీ కుంటుంబ అభిమానులతో ఆమె టచ్‌లోనే ఉంటుంది. వీలు చిక్కినప్పుడల్లా ఫ్యామిలీకి సంబంధించిన పాత పిక్స్‌ని షేర్ చేస్తుంది. ఈమె తాజాగా సోషల్ మీడియాలో ఓ పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోని షేర్ చేసింది. అందులో ఓ బాబు, ఓ పాప ఉన్నారు. ఆ పాప పక్కనే ఉన్న ఆ బాబుని కొడుతూ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఆ పిక్‌లో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా?.. ఎవరో కాదు.. ఆ చిన్నారి సబా కాగా.. పక్కనే ఉన్న బాలుడు ఆమె సోదరుడు, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్.
సభా షేర్ చేసిన ఆ పిక్‌కి.. ‘తోబుట్టువులు.. అన్నయ్యకి చిరాకు కలిగించి ఎంజాయ్ చేయడాన్ని మిస్స్ అవుతున్నాను. కెమెరాకు చిక్కిన మా చిన్ననాటి మధురానుభూతులు’ అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. ఈ పిక్స్‌ని చూసిన నెటిజన్లు తమ చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ అంటూ, ఉత్తమ సోదరుడు ఉత్తమ సోదరి, అందమైన అనుభూతులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సబా పాత పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. సందర్భం వచ్చినప్పుడల్లా తన కుటుంబానికి సంబంధించిన పిక్స్ అభిమానులతో పంచుకుంటూనే ఉంది.
