సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RRR: జపాన్‌లో ఆ రోజే విడుదల కానున్న ‘ఆర్ఆర్ఆర్’

ABN, First Publish Date - 2022-07-22T00:37:04+05:30

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరిస్(Olivia Morris) కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టై‌న్‌మెంట్ నిర్మించింది.  ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌గా నిలిచింది. భారీ స్థాయిలో కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రూ. 1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా త్వరలో జపాన్‌లో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 


‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌లో అక్టోబరు 21న విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. అందుకు సంతోషంగా ఉన్నామని వివరించింది. ‘ఆర్ఆర్ఆర్’ ను విజువల్ వండర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను స్పూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. 1920ల నేపథ్యంలో చిత్రం కొనసాగుతుంది. లక్ష్య సాధన కోసం ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా పోరాడారు.. ఈ పోరాటంలో వారికీ ఏ విధమైన సవాళ్లు ఎదురయ్యాయి..వాటిని ఏవిధంగా అధిగమించారనేది చిత్ర సారాంశం. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ చిత్రంపై అనేక మంది పొగడ్తల వర్షం కురిపించారు.



Updated Date - 2022-07-22T00:37:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!