సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘కేజీఎఫ్-2’ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా.. ఆ క్లబ్‌లోకి చేరిన ‘ఆర్‌ఆర్‌ఆర్’..

ABN, First Publish Date - 2022-04-17T23:12:28+05:30

దర్శక ధీరుడు రాజమౌళి తెరెకెక్కించిన సినిమా ‘రౌద్రం, రణం, రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శక ధీరుడు రాజమౌళి తెరెకెక్కించిన సినిమా ‘రౌద్రం, రణం, రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. హిందీ వెర్షన్ బాలీవుడ్‌లో రూ.250కోట్ల వసూళ్ల మార్కును దాటింది. ‘కేజీఎఫ్-2’ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ ‘ఆర్ఆర్‌ఆర్’ మూవీ కలెక్షన్లను కొల్లగొడుతునే ఉంది. ఓవర్సీస్‌లోను దాదాపుగా 14మిలియన్ల కలెక్షన్లను రాబట్టింది. 


భారత్‌లో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ రూ.250కోట్ల వసూళ్లను దాటిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం రూ.250.09కోట్లను రాబట్టిందని తెలుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ను రాజమౌళి ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కించాడు. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతరామరాజు, కొమురం భీంలను ఆధారంగా చేసుకుని రూపొందించాడు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌‌తో ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో ఆలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, ఓలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ తదితరులు కీలక ప్రాతలు పోషించారు.



Updated Date - 2022-04-17T23:12:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!