Singham 3: లేడీ ‘సింగం’గా దీపికా పదుకొనే.. ఇది అఫిషీయల్..

ABN , First Publish Date - 2022-12-09T18:40:56+05:30 IST

బాలీవుడ్‌లో పోలీస్ చిత్రాలు అంటే మొదట గుర్తొచ్చేది రోహిత్ శెట్టి (Rohit Shetty). దీనిలో భాగంగా ఆయన ప్రత్యేకంగా కాప్ యూనివర్స్‌..

Singham 3: లేడీ ‘సింగం’గా దీపికా పదుకొనే.. ఇది అఫిషీయల్..

బాలీవుడ్‌లో పోలీస్ చిత్రాలు అంటే మొదట గుర్తొచ్చేది రోహిత్ శెట్టి (Rohit Shetty). దీనిలో భాగంగా ఆయన ప్రత్యేకంగా కాప్ యూనివర్స్‌(Cop Universe)నే సృష్టించాడు. అందులో భాగంగా అజయ్ దేవ్‌గణ్‌ (Ajay Devgn)తో రెండు ‘సింగం’ చిత్రాలు, రణ్‌వీర్ సింగ్‌తో ‘సింబా’, అక్షయ్ కుమార్‌తో ‘సూర్యవంశీ’ని తెరకెక్కించాడు. అలాగే త్వరలోనే ఓ లేడీ పోలీస్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ తరుణంలోనే ‘సింగం’ సిరీస్‌లో భాగంగా ‘సింగం ఎగైన్’ అనే చిత్రాన్ని చేయనున్నాడు. అందులో అజయ్‌ దేవ్‌గణ్‌తో పాటు బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) కూడా నటించనుంది.


ఈ విషయాన్ని స్వయం డైరెక్టర్ రోహిత్ శెట్టే ప్రకటించాడు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘సర్కస్’ (Cirkus). ఈ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘ఈమె లేడీ సింగం’ అంటూ దీపకాని పరిచయం చేశాడు. దాంతో.. రోహిత్ కాప్ యూనివర్స్‌లో వచ్చిన నాలుగు సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనని బాలీవుడ్ జనాలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా.. ఆ సినిమాలో దీపికా పాత్ర ఎలా ఉంటుందో చూడాలని కూడా ఆమె అభిమానులు ఊవ్విళ్లూరుతున్నారు.


కాగా.. ఇంతకుముందే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ కోసం దీపికని డైరెక్ట్ చేశాడు రోహిత్ శెట్టి. ఆ తర్వాత వారు కలిసి పని చేయబోయే సినిమా ఇదే. ఈ మూవీ కూడా ఆ సినిమాలాగే సూపర్ హిట్ ‌కావాలని దీపక ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.





Updated Date - 2022-12-09T18:40:56+05:30 IST