Rohit Shetty: ‘సింగం’ ప్రాంచైజీలో మూడో సినిమా
ABN , First Publish Date - 2022-12-02T01:41:06+05:30 IST
బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ ‘సింగం’ (Singham). ఈ ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు ‘సింగం’, ‘సింగం రిటర్న్స్’ (Singham Returns) సంచలన విజయం సాధించాయి.

బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ ‘సింగం’ (Singham). ఈ ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు ‘సింగం’, ‘సింగం రిటర్న్స్’ (Singham Returns) సంచలన విజయం సాధించాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ సిరీస్‌లో అజయ్ దేవగణ్ (Ajay Devgn) నటించాడు. రోహిత్ శెట్టి (Rohit Shetty) దర్శకత్వం వహించాడు. అజయ్, రోహిత్ మూడోసారి చేతులు కలపబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘సింగం ఎగైన్’ (Singham Again) అని టైటిల్ నిర్ణయించారు. అద్భుతమైన స్క్రిఫ్ట్‌తో రోహిత్ ఈ సినిమాను డిజైన్ చేయనున్నాడని సమాచారం.
రోహిత్ శెట్టి చివరగా ‘సూర్య వంశీ’ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పోలీసాఫీసర్‌గా కనిపించాడు. కరోనా అనంతరం వెలవెలబోయిన థియేటర్స్‌కు ఈ చిత్రమే కళను తీసుకువచ్చింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ ఎండింగ్లో అజయ్ దేవగణ్, రణ్ వీర్ సింగ్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఈ సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడ నుంచే ‘సింగం ఎగైన్’ ప్రారంభం కాబోతుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ చిత్రంతో కాప్ యూనివర్స్‌ని విస్తరించాలనే ఆలోచనలో రోహిత్ ఉన్నాడని సమచారం. ప్రస్తుతం అజయ్ దేవగణ్ ‘భోలా’ (Bholaa) లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తవగానే ‘సింగం ఎగైన్’ పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. రోహిత్ శెట్టి తెరకెక్కించే కాప్ సినిమాలకు బాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా మరో కాప్ చిత్రం వస్తుందని తెలపడంతో అభిమానులందరు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
Read more