బాలీవుడ్‌లో ‘కేజీఎఫ్-2’ సంచలనం.. బుకింగ్స్ ప్రారంభమైన 12 గంటల్లోనే..

ABN , First Publish Date - 2022-04-08T21:47:11+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కేజీఎఫ్: చాప్టర్-2

బాలీవుడ్‌లో ‘కేజీఎఫ్-2’ సంచలనం.. బుకింగ్స్ ప్రారంభమైన 12 గంటల్లోనే..

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కేజీఎఫ్: చాప్టర్-2’. పాన్ ఇండియాగా ఈ చిత్రం తెరకెక్కింది. యశ్ ఈ మూవీలో రాకీ భాయ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. సంజయ్ దత్ విలన్ పాత్రను పోషించాడు. రవీనా టండన్ ఓ కీలక పాత్రను పోషిస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ‘కేజీఎఫ్: చాప్టర్-1’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7న కొన్ని ప్రాంతాల్లోని థియేటర్లల్లో టిక్కెట్ల బుకింగ్‌ ప్రారంభమైంది. 


‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ టిక్కెట్‌లను అమ్మడం మొదలుపెట్టగానే, 12గంటల్లోనే దాదాపు లక్ష టిక్కెట్లు బుక్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన మొదటి రోజే దాదాపుగా రూ. 3కోట్లను వసూలు చేసింది. ‘కేజీఎఫ్-1’ విజయం సాధించడంతో, రెండో భాగంపై మంచి బజ్ ఉంది. దీంతో అభిమానులు విపరీతంగా టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు. పూణే, సూరత్, అహ్మదాబాద్, కోల్‌కత్తా, జైపూర్, లక్నో మొదలైన ప్రాంతాల్లో ఈ చిత్రం రూ.10లక్షల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఒక్క ముంబైలోనే రూ.75లక్షల వసూళ్లను రాబట్టింది. భారత్‌లోని అన్ని ప్రాంతాల్లో టిక్కెట్ బుకింగ్‌లను ప్రారంభించలేదు. ఒక వేళ బుకింగ్‌లు ప్రారంభమైతే  ఈ కలెక్షన్లు మరింత అధికమయ్యే అవకాశం ఉంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ కేవలం రూ.5.08కోట్లను మాత్రమే అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా సాధించింది. ‘కేజీఎఫ్-2’ సినిమా మొదటి రోజు రూ.3కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. బుధవారం నాటికి బుకింగ్‌ల ద్వారా రూ. 15నుంచి 17కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనాలున్నాయి. ‘కేజీఎఫ్-1’ ను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. మొదటి భాగాన్ని చూసినవారు రెండో దానిని తప్పక చూడాలనుకుంటున్నారు. మొదటి రోజున ఈ చిత్రం దాదాపుగా రూ. 50కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుందని బాలీవుడ్ ట్రేడ్ ఎక్స్‌ఫర్ట్స్ చెబుతున్నారు.

Updated Date - 2022-04-08T21:47:11+05:30 IST

Read more