సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆమె నన్ను ఎంత గానో మార్చింది: Rithvik Dhanjani

ABN, First Publish Date - 2022-06-14T00:15:47+05:30

‘పవిత్ర రిష్తా’ (Pavitra Rishta) సీరియల్‌‌లో నటించి ఫేమ్ సంపాదించుకున్న నటీ, నటులు ఆశా నేగి(Asha Negi), రిత్విక్ ధంజని (Rithvik Dhanjani). ఇండస్ట్రీలో సెలబ్రిటీ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. కొన్నేళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పవిత్ర రిష్తా’ (Pavitra Rishta) సీరియల్‌‌లో నటించి ఫేమ్ సంపాదించుకున్న నటీ, నటులు ఆశా నేగి(Asha Negi), రిత్విక్ ధంజని (Rithvik Dhanjani). ఇండస్ట్రీలో సెలబ్రిటీ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు. ఏమైందో తెలియదు కానీ అనివార్య కారణాల వల్ల విడిపోయారు. ఈ బంధం బీటలు వారినప్పటి నుంచి రిత్విక్ తన రిలేషన్‌షిప్ స్టేటస్‌ను ఎప్పుడు బయటకు వెల్లడించలేదు. డేటింగ్ చేస్తున్నట్టు బహిరంగంగా తెలపలేదు. తాజాగా అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. రిలేషన్‌షిప్‌ను ఇక మీదట ఎప్పుడు బయటకు వెల్లడించనని అతడు చెప్పాడు.   


తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను రిత్విక్ ధంజని అభిమానులతో పంచుకున్నాడు. ‘‘గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రిలేషన్‌షిప్‌ను ప్రైవేటుగా ఉంచుతున్నాను. ఆశానేగితో డేటింగ్ చేసినప్పుడు నా జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సున్నితంగా, దయ కలవాడిగా నేను మారాను. మంచి మనిషిగా మారాడానికీ ఆమె ఎంతగానో సహాయపడింది. నాలోని లోపాలు నాకు ఎప్పటికీ తెలిసేవి కావు. అందుకు ఆమెకు కృతజ్ఞతలు. మా బంధం అద్భుతంగా కొనసాగింది. ప్రస్తుతం ముగిసిపోయింది కాబట్టి నేను మౌనంగా ఉండాలనుకుంటున్నాను’’ అని రిత్విక్ చెప్పాడు. ఇక నుంచి రిలేషన్‌షిప్‌ను ఎప్పుడు పబ్లిక్‌గా వెల్లడించనని అతడు పేర్కొన్నాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రిత్విక్ ధంజని ప్రస్తుతం ఓ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. టైటిల్ ఇంత వరకు నిర్ణయించలేదు. కరణ్ వహీ‌తో కలసి ఈ షోకు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రిత్విక్ గతంలో పలు ఓటీటీ షోలలో కనిపించాడు. రియాలిటీ షోలో పాల్గొనడంతో పాటు యాంకర్‌గాను వ్యవహరించాడు.

Updated Date - 2022-06-14T00:15:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!