Richest Bollywood Actors: అమితాబ్ నుంచి ఆమిర్ ఖాన్ వరకు.. ఈ బాలీవుడ్ హీరోలు రోజుకు ఎంతెంత సంపాదిస్తారంటే..

ABN , First Publish Date - 2022-08-23T01:51:55+05:30 IST

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు అందరు. బాలీవుడ్ హీరోలు అందరు ఆ మాటను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. సినిమాల ద్వారానే కాకుండా మరెన్నో మార్గాల ద్వారా వారు అర్జిస్తున్నారు. బీ

Richest Bollywood Actors: అమితాబ్ నుంచి ఆమిర్ ఖాన్ వరకు.. ఈ బాలీవుడ్ హీరోలు రోజుకు ఎంతెంత సంపాదిస్తారంటే..

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు అందరు. బాలీవుడ్ హీరోలు ఆ మాటను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. సినిమాల ద్వారానే కాకుండా మరెన్నో మార్గాల ద్వారా వారు అర్జిస్తున్నారు. బీ టౌన్ హీరోలు మూవీస్ చేయడంతో పాటు యాడ్‌లతోను భారీగా కూడబెడుతున్నారు. చిత్రాల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఎన్నో రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. కెరీర్ చివరి దశలో ఇబ్బందులు పడకూడదని ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. మరి, బాలీవుడ్ హీరోలు రోజుకు ఎంతెంత సంపాదిస్తారో తెలుసుకోవాలనుందా.. మరికెందుకు ఆలస్యం ఆ వివరాలపై ఓ లుక్కేయండి మరి..


షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan):

బాలీవుడ్ సెలబ్రిటీల్లోనే అత్యంత ధనవంతుడు షారూఖ్ ఖాన్. రెడ్ ఛిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో సొంత నిర్మాణ సంస్థ ఉంది. అదే పేరుతో విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఉంది. ఐపీఎల్ టీం కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్రాంచైజీకీ యజమాని. కింగ్ ఖాన్ రోజుకు రూ. 1.4కోట్లను సంపాదిస్తాడట. అతడి ఆస్తుల విలువ రూ. 5,593కోట్లని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. 


అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan): 

అమితాబ్ బచ్చన్‌కు ఏబీసీఎల్ (అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్) పేరుతో సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థపై సినిమాలు నిర్మించి  అప్పుల్లో కూరుకుపోయాడు. ఒకానొక స్థితిలోకి దివాళా అంచుకు కూడా చేరుకున్నాడు. కానీ, ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం రావడంతో బిగ్ బీ దశ తిరిగింది. తిరిగి పుంజుకున్నాడు. అమితాబ్ రోజుకు రూ.1.2కోట్లను సంపాదిస్తాడట. అతడి ఆస్తుల విలువ రూ. 3995కోట్లని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. 


సల్మాన్ ఖాన్ (Salman Khan):

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. అతడికీ మాస్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. బాలీవుడ్ బాయ్‌జాన్ సినిమా ప్లాఫ్ అయినా కూడా రూ. వంద కోట్ల వసూళ్లను సాధిస్తున్నడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అతడికీ ‘బీయింగ్ హ్యూమాన్ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థ ఉంది. పన్వేల్‌లో వంద ఎకరాల్లో ఓ ఫామ్‌హౌస్ ఉంది. సల్లూ భాయ్ ప్రతి రోజు రూ. కోటిని అర్జిస్తాడట. అతడి పూర్తి ఆస్తుల విలువ రూ. 2875కోట్లని వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి.


అక్షయ్ కుమార్ (Akshay Kumar):

బాలీవుడ్‌లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్. 30 నుంచి 40రోజుల్లోనే మూవీ షూటింగ్స్‌ను పూర్తి చేస్తుంటాడు. ప్రతి ఏడాది 4 నుంచి 5 చిత్రాలను విడుదల చేస్తుంటాడు. సినిమాలతోనే అక్షయ్ భారీగా సంపాదిస్తాడట. ప్రతి రోజు అక్కీ కోటి రూపాయాలను సంపాదిస్తాడని టాక్. అతడి ఆస్తుల విలువ రూ. 2596కోట్లని సమాచారం. 


ఆమిర్ ఖాన్ (Aamir Khan): 

సినిమా కోసం ఆమిర్ ఖాన్ చాలా కష్టపడతాడు. ఎటువంటి పాత్రను చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అందువల్ల అతడి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే భారీ లాభాలు వస్తాయి. దీంతో ఆమిర్ ప్రతి సినిమాకు రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లోను వాటా తీసుకుంటాడు. అతడు ప్రతి రోజు రూ. 33.5లక్షలు సంపాదిస్తాడని బీ టౌన్ మీడియా టాక్. అతడి ఆస్తుల విలువ రూ. 1800కోట్లు అని తెలుస్తోంది.   


Updated Date - 2022-08-23T01:51:55+05:30 IST

Read more