సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sushant Singh Rajput రెండో వర్థంతి.. ఇద్దరూ కలిసి దిగిన Unseen Photos ను పోస్ట్ చేసిన Rhea Chakraborty

ABN, First Publish Date - 2022-06-15T16:38:20+05:30

రెండేళ్ల క్రితం జూన్ 14, 2020న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండేళ్ల క్రితం జూన్ 14, 2020న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన మరణం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న సుశాంత్ ఫ్యాన్స్ సపోర్టుగా నిలుస్తూ ఆయన మృతి పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనది ఆత్మహత్య అని తేల్చారు. అయినప్పటికీ.. ఆయన మరణంపై అనుమానాలు పోలేదు. కాగా.. జూన్ 14, 2022న సుశాంత్ రెండో వర్థంతి. ఈ సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ పలువురు సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆయన మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి సైతం ఇన్‌‌స్టాగ్రామ్‌ (Instagram)లో సుశాంత్‌తో కలిసున్న కొన్ని రేర్ ఫొటోలని షేర్ చేసింది.


రియా షేర్ చేసిన పిక్స్‌లో సుశాంత్ ఎంతో ఆనందంగా నవ్వుతూ ఉన్నాడు. వారిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ఒక పిక్‌లో ఈ బ్యూటీ సుశాంత్‌ని ముద్దాడుతుండగా.. మరో దానిలో ఈ దివంగత నటుడు రియాని చేతులతో ఎత్తుకొని ఉన్నాడు. ఈ పిక్స్‌కి.. ‘ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతున్నాను’ అని రియా క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు రియా పోస్ట్‌పై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు.. ‘ఇది పబ్లిసిటీ స్టంట్’, ‘బయటికి చూపించుకోవడానికే కానీ.. నిజం కాదు’ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. అలాగే.. మరికొందరూ ‘నువ్వు నిజంగా చాలా స్ట్రాంగ్’ అంటూ రియాకి సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-06-15T16:38:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!