Rhea Chakraborty: చివరికి ఆమె ఎలా బతకాలో నేర్చుకుంది
ABN , First Publish Date - 2022-02-23T21:16:10+05:30 IST
‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా టాలీవుడ్ పరిచయమైన నటి రియా చక్రవర్తి. అనంతరం బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ మంచి పాపులారిటీనే సాధించింది...
‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా టాలీవుడ్ పరిచయమైన నటి రియా చక్రవర్తి. అనంతరం బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ మంచి పాపులారిటీనే సాధించింది. అయితే ఈ భామ సినిమాల కంటే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, డ్రగ్స్ రాకెట్ కేసుల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అలాగే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటూ అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
రియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎల్లో లెహెంగాలో మెస్మరైజింగ్‌గా ఉన్న పిక్స్‌ని పోస్ట్ చేసింది. వాటికి.. ‘ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట.. చివరికి ఇప్పుడు ఆమె వర్తమానంలో ఎలా బతకాలో నేర్చుకుంది’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ బ్యూటీ ఈ ఫొటోలని పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సుశాంత్ అభిమానులు వరుసగా కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. కొందరు ‘ఎంతో అందంగా ఉన్నావ్’, ‘లవ్ లీ’ అంటూ ప్రశంసిస్తుండగా.. మరికొందరు సుశాంత్ విషయాన్ని గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.