సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sushant Singh Rajput జీవితాన్ని నాశనం చేసిందంటూ అతడి సోదరి కామెంట్స్‌కు Rhea Chakraborty స్ట్రాంగ్ రియాక్షన్..!

ABN, First Publish Date - 2022-07-16T22:36:59+05:30

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్(Sushant Singh Rajput) మరణంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty). ఈ కేసులో భాగంగా పోలీసులు 2020 సెప్టెంబర్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్(Sushant Singh Rajput) మరణంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty). ఈ కేసులో భాగంగా పోలీసులు 2020 సెప్టెంబర్‌లో ఆమెను అరెస్టు చేశారు. దీంతో నెల రోజుల పాటు జైలులో ఉంది. అనంతరం బాంబే హైకోర్టు మెట్లెక్కి షరతులతో కూడిన బెయిల్‌ను తెచ్చుకుంది. బెయిల్‌పై బయటికి వచ్చినప్పటికీ సుశాంత్ కుటుంబం, అభిమానుల నుంచి ఆమె విమర్శలు ఎదుర్కొంటునే ఉంది.  


సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంక సింగ్(Priyanka Singh) తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రియా చక్రవర్తిపై పలు ఆరోపణలు చేసింది. ‘‘సుశాంత్‌ సింగ్ రాజ్‌ఫుత్ జీవితంలోకి రియా చక్రవర్తి వచ్చినప్పటి నుంచే అతడిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రియా అతడిని లక్ష్యంగా చేసుకుంది. సుశాంత్‌కు పార్టీలు, క్లబ్‌లు అలవాటు చేసింది. ఆమె మూలంగానే అతడు అలా తయారయ్యాడు’’ అని ప్రియాంక సింగ్ తెలిపింది. ప్రియాంక మాటలకు రియా స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది. ఆసక్తికరంగా పోస్ట్ పెట్టింది. ‘‘శబ్దానికి, ఈగోకు అతీతంగా ఉండు. వారు నీవైపు వేలెత్తి చూపేలా ఎదుగు. ఎందుకంటే వారు చేరుకోలేని స్థానంలో నువ్వు ఉండాలి. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ప్రేమతో ఎగరాలి. ఏ కారణం లేకుండానే నువ్వు వారిపట్ల కరుణతో వ్యవహరించాలి. నువ్వు వారిని ఆశ్చర్యపరచాలి. నీలా నువ్వు ఉండు. అదే నువ్వు. అదే నీ జీవితం. అంతేకాని ఇతరులు చెప్పేలా నువ్వు ఉండకు’ అని రియా చక్రవర్తి తెలిపింది. సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) తాజాగా ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్‌లో దాదాపుగా 34మంది పేర్లను చేర్చింది. సుశాంత్ సింగ్‌కు రియానే మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి ఇచ్చిందని, అందువల్లే అతడు వాటికీ బానిసగా మారాడని ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. అతడి మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఆరోపించింది.   


Updated Date - 2022-07-16T22:36:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!