నోరు జారిన అర్థనగ్న సుందరి... జార్ఖండ్‌లో పోలీస్ కంప్లైంట్...

ABN , First Publish Date - 2022-04-23T01:44:35+05:30 IST

వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి ఆమె మీద జార్ఖండ్ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంతకీ రాఖీ చేసిన తప్పేంటంటే... తాను వేసుకున్న అర్థనగ్న దుస్తుల్ని ఆమె ‘ట్రైబల్ డ్రస్’ అంటూ...

నోరు జారిన అర్థనగ్న సుందరి... జార్ఖండ్‌లో పోలీస్ కంప్లైంట్...

వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి ఆమె మీద జార్ఖండ్ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంతకీ రాఖీ చేసిన తప్పేంటంటే... తాను వేసుకున్న అర్థనగ్న దుస్తుల్ని ఆమె ‘ట్రైబల్ డ్రస్’ అంటూ నెటిజన్స్‌కు పరిచయం చేసింది. అలా మాట్లాడటం కొందరికి కోపం తెప్పించింది. 


రాంచీలోని ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్‌లో రాఖీ సావంత్‌పై కేసు నమోదైంది. అయితే, ఆమె అంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో అప్‌లోడ్ చేసింది. ట్రైబల్ డ్రస్ అంటూ కురచ దుస్తుల్లో కనిపించింది. దాంతో వెంటవెంటనే సొషల్ మీడియాలో రాఖీ ‘ట్రైబల్ వీడియో’ వైరల్ అయింది... 


ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన వీడియో జార్ఖండ్‌లోని ‘సెంట్రల్ సర్నా కమిటీ’ అధ్యక్షుడు అజయ్ టిర్కీ దృష్టిలో పడింది. దాంతో ఆయన బుధవారం కంప్లైంట్ నమోదు చేశాడు. ఆయన ఆరోపణ ప్రకారం... రాఖీ సావంత్ తన వీడియోలో ‘‘నేను ఈ రోజు ట్రైబల్ డ్రస్ వేసుకున్నాను...’’ అందట. కానీ, ఇప్పుడు అందుబాటులో లేని సదరు వీడియో గిరిజనుల్ని, గిరిజన మహిళల్ని అవమానపరిచే విధంగా ఉందని అజయ్ అంటున్నారు. అర్థనగ్నంగా కనిపిస్తూ... అదే గిరిజనుల వస్త్రధారణ అనటం... తమని అవమానించటమే అంటున్నారాయన. 


రాఖీ సావంత్ తన కాంట్రవర్సియల్ సెమీ న్యూడ్ వీడియో ఇప్పటికే డిలీట్ చేసినప్పటికీ దుమారం మాత్రం సద్దుమణగటం లేదు. ఆమె తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని జార్ఖండ్ గిరిజన నేత అజయ్ డిమాండ్ చేస్తున్నారు. అంత వరకూ తమ నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. హింసాత్మక నిరసనలకి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. 

Updated Date - 2022-04-23T01:44:35+05:30 IST