సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bollywood Couples: ఆలియా భట్ నుంచి జయాబచ్చన్ వరకు.. ఈ 9 మంది తమ భర్తలతో నటించిన మొట్టమొదటి సినిమాలు ఏదో తెలుసా..?

ABN, First Publish Date - 2022-09-06T00:35:09+05:30

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రూ. 410కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందింది. ఈ సినిమాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రూ. 410కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమాలో ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే వీరు ప్రేమలో పడ్డారు. అనంతరం కొంతకాలం డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. దీపికా పదుకొణె, జయా బచ్చన్, హేమ మాలిని వంటి ఎంతో మంది తారలు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులనే పెళ్లి చేసుకున్నారు. ఇలా ఎంతో మంది తారలు తమ భర్తలతో నటించిన మొట్టమొదటి సినిమాలపై ఓ లుక్కేద్దామా..


నర్గీస్- సునీల్ దత్ (Nargis and Sunil Dutt): 

మదర్ ఇండియా సినిమాలో నర్గీస్, సునీల్ దత్ తొలిసారి జంటగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అప్పట్లోనే రూ. 4కోట్ల వసూళ్లను రాబట్టింది. 


ధర్మేంద్ర-హేమ మాలిని (Dharmendra and Hema Malini):

తుమ్ హసీన్ మే జవాన్ మూవీలో ధర్మేంద్ర, హేమ మాలిని మొదటిసారిగా జోడీగా కనిపించారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. రూ. 1.45కోట్ల నెట్ కలెక్షన్స్‌ను సాధించింది. 


అమితాబ్ బచ్చన్-జయా బచ్చన్ (Amitabh Bachchan and Jaya Bachchan):

బన్సి బిర్జు చిత్రంలో జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ మూవీ దారుణంగా పరాజయం పాలైంది. చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా వసూళ్లను రాబట్టలేదు. 


రిషి కపూర్- నీతూ సింగ్ (Rishi Kapoor and Neetu Singh):

రవ్పూ చక్కర్ సినిమాలో రిషి కపూర్, నీతూ సింగ్ తొలిసారి కలసి నటించారు. ఈ సినిమా యావరేజ్‌గా నడిచింది. రూ. 1.75కోట్ల నెట్ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది.


అక్షయ్ కుమార్- ట్వింకిల్ ఖన్నా (Akshay Kumar and Twinkle Khanna):  

ఇంటర్నేషనల్ ఖిలాడీ మూవీలో ట్వింకిల్ ఖన్నా, అక్షయ్ కుమార్ మొదటిసారి జంటగా నటించారు. ఈ చిత్రం యావరేజ్‌గా ఆడింది. రూ. 9కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. 


ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ (Aishwarya Rai and Abhishek Bachchan):

ధై అక్షర్ ప్రేమ్ కే చిత్రంలో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా ప్లాప్ అయింది. రూ.8.17కోట్ల నెట్ కలెక్షన్స్‌ను సాధించింది. 


కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ (Kareena Kapoor and Saif Ali Khan): 

ఓంకార సినిమాలో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ మొదటిసారి జోడీగా కనిపించారు. ఈ చిత్రం దారుణంగా పరాజయం పాలైంది. రూ. 23. 22కోట్ల నెట్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. 


రణ్‌వీ‌ర్ సింగ్ -దీపికా పదుకొణె (Ranveer Singh and Deepika Padukone):

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘రామ్ లీలా’ లో మొదటిసారి రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె జంటగా నటించారు. ఈ మూవీ సంచలన విజయం సాధించింది. రూ. 116కోట్ల నెట్ కలెక్షన్స్‌ను రాబట్టింది. 


Updated Date - 2022-09-06T00:35:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!