Viral Video: దూసుకొచ్చిన అభిమాని.. అడ్డుకోబోయిన Bodyguard.. Rashmika Mandanna ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2022-06-14T20:50:29+05:30 IST
టాలీవుడ్‌తో పాటు ఇతర దక్షిణాది సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న నటి రష్మికా మందన్నా...
టాలీవుడ్‌తో పాటు ఇతర దక్షిణాది సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న నటి రష్మికా మందన్నా (Rashmika Mandanna). వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ గతేడాది విడుదలైన.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ మూవీ ‘పుష్ప(Pushpa)’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. అంతేకాకుండా ‘మిస్టర్ మజ్ను’, ‘యానిమల్’ వంటి బాలీవుడ్ సినిమాల్లో స్టార్ హీరోలతో నటిస్తూ అక్కడ సైతం తనముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. అయితే.. పుష్పతో వచ్చిన స్టార్డమ్తో ఎక్కడికి వెళ్లిన ఆమె చుట్టూ పలువురు అభిమానులు చేరుతూ సెల్ఫీలు అడగడం మామూలైపోయింది. తాజాగా రష్మికకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. ఓ ఫ్యాన్‌తో రష్మిక ప్రవర్తించిన తీరుతో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
ఆ వైరల్ వీడియోలో రష్మిక షూటింగ్ స్పాట్లో ఉంది. ఈ భామ అక్కడికి వచ్చిన సినీ రిపోర్టర్ల ఫొటోలకి స్టిల్స్ ఇస్తోంది. ఈ తరుణంలో ఓ అభిమాని సెల్పీ కోసం ఈ బ్యూటీ వైపునకు దూసుకొచ్చాడు. అది గమనించిన ఈ తారా బాడీగార్డు అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అది చూసిన రష్మిక గార్డుని వారించి ఆ అభిమానితో ఓ ఫొటో దిగింది. ఈ వీడియోని ఓ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ రష్మికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘చాలా స్వీట్’, ‘దక్షిణాది నటులు చాలా ఒద్దికగా ఉంటారు. బాలీవుడ్ నటులలాగా కాదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్లో అల్లు అర్జున్‌తో పుష్ప సెకండ్ పార్ట్, తమిళంలో విజయ్‌తో ఓ సినిమా, బాలీవుడ్లో మిస్టర్ మజ్ను, యానిమల్, అలాగే మరికొన్ని సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతోంది.