టైగర్ ష్రాఫ్‌కు జోడీగా Rashmika Mandanna..!

ABN , First Publish Date - 2022-07-08T20:59:58+05:30 IST

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్న(Rashmika Mandanna). ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన

టైగర్ ష్రాఫ్‌కు జోడీగా Rashmika Mandanna..!

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్న(Rashmika Mandanna). ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) సినిమాతో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అభిమానులను సంపాదించుకుంది. తాజాగా బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను ఒకే చేస్తుంది. బీ టౌన్‌లో ‘మిషన్ మజ్ను’ (Mission Majnu), ‘గుడ్ బై’ (Goodbye) వంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు విడుదల కాకముందే మరో ప్రాజెక్టులో ఆమె హీరోయిన్‌గా ఎంపికయిందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. 


బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff). శశాంక్ ఖైతాన్ (Shashank Khaitan) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. కరణ్ జోహార్ నిర్మించబోతున్నాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. సెప్టెంబర్ నుంచి సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో టైగర్‌కు జోడీగా రష్మిక మందన్న నటించనుందని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘‘టైగర్‌కు జోడీగా కొత్తమ్మాయి అయితే బాగుంటుందని శశాంక్ భావించాడు. అందువల్ల రష్మిక మందన్నను హీరోయిన్‌గా తీసుకున్నాడు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ లోకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణను జరపనున్నారు. ఈ చిత్రంలో యాక్షన్‌తో కూడిన అడ్వెంచర్ ఉంటుంది. టైగర్ గతంలో ఇటువంటి యాక్షన్ సన్నివేశాలను ఏ సినిమాలో చేయలేదు’’ అని చిత్ర బృందంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి చెప్పారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రష్మిక చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ‘వారసుడు’ షూటింగ్‌లో పాల్గొంటుంది. ‘పుష్ప: ది రూల్’ చిత్రీకరణను త్వరలోనే ప్రారంభించనుంది. 

Updated Date - 2022-07-08T20:59:58+05:30 IST

Read more