ప్రభాస్ ‘Spirit’ లో ఛాన్స్ కోసం పోటీపడుతున్న హీరోయిన్‌లు..!

ABN , First Publish Date - 2022-05-12T22:05:01+05:30 IST

‘అర్జున్ రెడ్డి’ సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). ఇదే సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ ( Kabir Singh)

ప్రభాస్ ‘Spirit’ లో ఛాన్స్ కోసం పోటీపడుతున్న హీరోయిన్‌లు..!

‘అర్జున్ రెడ్డి’ సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). ఇదే సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ ( Kabir Singh) పేరుతో రీమేక్ చేసి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాడు. సందీప్ ప్రస్తుతం ‘యానిమల్’ (Animal) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్(RanbirKapoor) హీరోగా నటిస్తున్నాడు. ‘యానిమల్’ తర్వాత సందీప్ ప్రభాస్( Prabhas)తో ‘స్పిరిట్’ (Spirit) సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం.. ఇద్దరు కథానాయికలు పోటీపడుతున్నారని తెలుస్తోంది. 


‘స్పిరిట్’ లో హీరోయిన్ పాత్ర కోసం కియారా అడ్వాణీ (Kiara Advani), రష్మిక మందన్న (Kiara Advani) పోటీ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభాస్‌తో వీరిద్దరు ఇప్పటివరకు సినిమా చేయలేదు. ‘బాహుబలి’ స్టార్ పక్కన హీరోయిన్‌గా నటింప చేస్తే జోడీ సరికొత్తగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ప్రారంభం కాక ముందే హీరోయిన్‌ను ఫైనలైజ్ చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందట.  నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా రష్మిక మందన్న ఇప్పటికే సందీప్ దర్శకత్వం వహిస్తున్న‘యానిమల్’ లో హీరోయిన్‌గా నటిస్తుంది. కియారా అడ్వాణీ గతంలోనే అతడు తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’ సినిమాలో కథానాయిక పాత్రను పోషించింది. మరి ఈ ఇద్దరిలో ఎవరు హీరోయిన్‌గా నటిస్తారో తెలియాలంటే చిత్ర బృందం ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే. అసలు ‘యనిమల్’ కథను మహేశ్ బాబు కోసం సందీప్ రాశాడట. సూపర్ స్టార్‌కు ఈ కథను వినిపించగా సినిమా చేసేందుకు అంగీకరించలేదని సమాచారం.

Updated Date - 2022-05-12T22:05:01+05:30 IST

Read more