Ranveer Singh: న్యూడ్ ఫొటోషూట్‌పై రణ్‌వీర్‌కి సమన్లు.. నటుడు రిక్వెస్ట్ చేశాడంటే..
ABN , First Publish Date - 2022-08-22T16:32:20+05:30 IST
బాలీవుడ్ యువ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) చేసిన న్యూడ్ ఫొటోషూట్‌పై చెలరేగిన వివాదం గురించి తెలిసిందే..
బాలీవుడ్ యువ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) చేసిన న్యూడ్ ఫొటోషూట్‌పై చెలరేగిన వివాదం గురించి తెలిసిందే. ఓ పేపర్ మ్యాగజైన్ కోసం చేసిన ఈ షూట్ పిక్స్‌ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయ్యాయి. దాంతో పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అంతటితో విషయం ముగిసిపోలేదు.
రణవీర్ న్యూడ్ ఫోటోలతో మహిళల మనోభావాలను దెబ్బతీశాడని, వారిని అవమానించాడని ఓ ఎన్జీవో కేసు వేసింది. అంతేకాకుండా.. ఆ పిక్స్‌ని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి తొలగించాలని అందులో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 509, 292, 293, ఐటీ చట్టంలోని సెక్షన్ 67ఏ కింద రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముంబై పోలీసులు ఆగస్ట్ 22న నటుడిని విచారణకు రావాలని సమన్లు (Summons) జారీ చేశారు. న్యూడ్ ఫోటోషూట్ కేసులో నటుడు రణవీర్ సింగ్ ముంబై పోలీసులను 2 వారాల సమయం కోరాడు. దీంతో కొత్త డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ముంబై పోలీసులు కొత్తగా సమన్లు జారీ చేయనున్నారు. కాగా.. ఐపీసీ సెక్షన్ 292 ప్రకారం 5 సంవత్సరాలు, సెక్షన్ 293 ప్రకారం 3 సంవత్సరాలు.. అలాగే.. ఐటీ చట్టం 67A ప్రకారం రణవీర్‌కు 5 సంవత్సరాల శిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.