సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ranveer Singh: నువ్వు ఎవరని అడిగిన జర్నలిస్ట్.. రణ్‌వీర్ రియాక్షన్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-11-21T17:48:53+05:30

బాలీవుడ్‌ (Bollywood) లోని స్టార్ హీరోల్లో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ఒకరు. నటుడిగానే కాకుండా ఆయన ఎనర్జీకి, డ్రెస్సింగ్ స్టైల్‌కి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ (Bollywood) లోని స్టార్ హీరోల్లో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ఒకరు. నటుడిగానే కాకుండా ఆయన ఎనర్జీకి, డ్రెస్సింగ్ స్టైల్‌కి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. నిజానికి రణ్‌వీర్‌కి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రణ్‌వీర్ ప్రస్తుతం అబు దాబిలో ఉన్నాడు. అక్కడ జరిగే ఎఫ్ 1 రేస్‌లను చూసేందుకు వెళ్లాడు. స్టేడియంలో ఆయన చాలా ఎంజాయ్ చేశాడు.


ఆ సమయంలో మార్టిన్ బ్రూండెల్ (Martin Brundle) అనే జర్నలిస్ట్ రణ్‌వీర్ సింగ్‌ని చూసి ‘నువ్వు ఎవరు?’ అని అడిగాడు. దానికి రణ్‌వీర్ ఫన్నీగా రియాక్షన్ ఇచ్చాడు. ‘నేను బాలీవుడ్ నటుడిని సర్. నేను ముంబై, ఇండియా నుంచి వచ్చాను. నేను ఓ ఎంటర్‌టైనర్‌ని’ అని చెప్పుకొచ్చాడు. అలాగే.. తన బట్టలపై తానే జోక్ వేసుకుంటూ ‘రేపు ఉదయమే ఈ బట్టలను వెనక్కి ఇచ్చేయాలి’ అని సరదాగా కామెంట్ చేశాడు. అది విన్న జర్నలిస్ట్ కూడా నవ్వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఎంతోమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైన రణ్‌వీర్ సింగ్ స్టైల్, సింప్లిసిటీ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







Updated Date - 2022-11-21T17:48:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!