సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shah Rukh, Salman పొరుగింటికి Ranveer, Deepika.. కొత్త ఫ్లాట్ ధరెంతో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-07-11T17:31:32+05:30

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనే (Deepika Padukone) జంట ఒకటి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనే (Deepika Padukone) జంట ఒకటి. ఈ జంటకి బీ టౌన్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ముంబైలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉండే బాంద్రా ప్రాంతంలో ఈ జంట ఓ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసింది. రణవీర్ సింగ్, ఆయన తండ్రి జుగ్జీత్ సుందర్‌సింగ్ భవ్నానీకి చెందిన ఓహ్ ఫైవ్ ఓహ్ మీడియా వర్క్స్ ఎల్‌ఎల్‌పి అనే సంస్థ ఈ అపార్ట్‌మెంట్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. జులై 8న Oh Five Oh Media Works LLP కుదర్చుకున్న ఈ ఒప్పందంలో దాదాపు రూ.119 కోట్ల భారీ ధరకి అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.


ఈ అపార్ట్‌మెంట్ ఆ భవనంలోని 16, 17, 18, 19వ అంతస్తులలో విస్తరించి ఉన్న లగ్జరీ క్వాడ్రప్లెక్స్ అపార్ట్మెంట్ అని తెలుస్తోంది. ఈ అపార్ట్‌మెంట్‌ కోసం దాదాపు 19 పార్కింగ్ స్లాట్‌లు సైతం కేటాయించారు. అపార్ట్‌మెంట్‌లో మొత్తం 11,266 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 1,300 చదరపు అడుగుల ప్రత్యేకమైన టెర్రేస్ ఉన్నాయి. ఈ లావాదేవీ కోసం రణ్‌వీర్ సంస్థ మొత్తం రూ.7.13 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించింది.


ఈ భవనం గురించి రియల్టర్ మాట్లాడుతూ.. ‘ఒక పాత భవనాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. కింది అంతస్తులను ఇప్పటికే ఉన్నవారికి కేటాయిస్తాం. అందులో 16వ అంతస్తులో 4బిహెచ్‌కె, మిగిలిన మూడు అంతస్తులు 17 నుంచి 19 వరకు పెంట్‌హౌస్‌గా ఉన్నాయి’ అని తెలిపాడు. ఈ భవనం బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘మన్నత్’, సల్మాన్ ఖాన్ (Salman Khan) ‘గెలాక్సీ’ నివాసాల మధ్య ఉంది. అంటే.. రణ్‌వీర్, దీపికా దంపతులు త్వరలో ఈ స్టార్స్‌కి పొరుగింటి వారు అవ్వనున్నారన్నమాట.


కాగా.. రణ్‌వీర్ ప్రస్తుతం ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లో ఆలియా భట్‌తో కలిసి నటిస్తున్నాడు.ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తుండగా.. ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ ముఖ్య పాత్రలు పొషిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే.. పూజా హెగ్డేతో కలిసి ‘సర్కస్’లో నటిస్తున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షేక్స్పియర్ రచించిన ‘ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ అనే నాటకం ఆధారంగా తెరెక్కుతోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ సినిమాని విడుదల చేసేందుకు మూవీ టీం సిద్ధమవుతోంది. అంతేకాకుండా.. దేశవ్యాప్తం సూపర్ పాపులారిటీ ఉన్న ఇండియన్ ఫస్ట్ సూపర్ హీరో ‘శక్తిమాన్’ కథతో ఓ ట్రైయాలజీ రానుంది. ఈ మూవీలో సైతం రణ్‌వీర్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ న్యూస్‌ గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Updated Date - 2022-07-11T17:31:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!