సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shamshera Trailer లాంచ్ ఈవెంట్‌లో భార్య Alia Bhatt గురించి Ranbir Kapoor ఆసక్తికర కామెంట్స్..

ABN, First Publish Date - 2022-06-25T01:09:32+05:30

విభిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా కొత్త రకం పాత్రలను పోషిస్తుంటారు. తాజాగా ఆయన నటించిన చిత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా కొత్త రకం పాత్రలను పోషిస్తుంటారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘షంషేరా’ (Shamshera). విజువల్ వండర్‌గా కరణ్ మల్హోత్రా (Karan Malhotra) తెరకెక్కించారు. రణ్ బీర్ తండ్రి, కొడుకులుగా ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. అందులో భాగంగా చిత్ర బృందం జూన్ 24న ట్రైలర్‌‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు రణ్‌బీర్ సమాధానమిచ్చారు. తన భార్య ఆలియా భట్ గురించి కూడా మాట్లాడారు. 


రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ను ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. తనకు ఆలియా కంటే మంచి జీవిత భాగస్వామి లభించదని రణ్‌బీర్ చెప్పారు. ‘‘ఈ ఏడాది నేను పెళ్లి చేసుకున్నాను. అందువల్ల నాకు అద్భుతమైన సంవత్సరం. పెళ్లి అనేది అన్నం, పప్పు వంటిది. ఆలియా కంటే మంచి జీవిత భాగస్వామి నాకు లభించదు’’ అని రణ్‌బీర్ చెప్పారు. ‘షంషేరా’ ను యశ్‌రాజ్ ఫలిమ్స్ నిర్మించింది. ఆ సంస్థ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తుంది. ఈ సినిమాలో వాణీ కపూర్ (Vaani Kapoor), సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్రలు పోషించారు. రణ్‌బీర్ నుంచి నాలుగేళ్ల తర్వాత ‘షంషేరా’ వస్తుంది. ఆయన చివరగా రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ‘సంజు’ (Sanju) చిత్రంలో కనిపించారు. రణ్‌బీర్ నటించిన మరో సినిమా ‘బ్రహ్మాస్త్ర’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. పాన్ ఇండియాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 

Updated Date - 2022-06-25T01:09:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!