సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Viral Video: ఐ లవ్యూ అంటూ ఫ్యాన్స్ కేకలు.. వెనక్కు తిరిగి మరీ Ranbir Kapoor రియాక్షన్ అదుర్స్..!

ABN, First Publish Date - 2022-05-10T18:45:26+05:30

బాలీవుడ్‌లో యువ నటుడు రణ్‌బీర్ కపూర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా ఈ నటుడికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో యువ నటుడు రణ్‌బీర్ కపూర్‌(Ranbir Kapoor)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా ఈ నటుడికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అలియా భట్‌తో పెళ్లి జరిగిన తర్వాత కూడా ఈ యంగ్ హీరోకి ఆ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ నటుడు దుబాయ్‌లో ఛారిటీ కోసం జరిగిన సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇతర నటులతోపాటు పాల్గొన్నాడు. ఆ మ్యాచ్ కోసం మైదానంలోకి వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


అందులో.. జట్టు కెప్టెన్ అభిషేక్ బచ్చన్ వెనుక రణ్‌బీర్ నిలుచుని ఉన్నాడు. ఆయన వెనుక కార్తీక్ ఆర్యన్‌తోపాటు ఇతర నటులు నిలుచున్నారు. దీంతో స్టేడియంలో ఉన్న అభిమానులు అందరు గోల చేయడం స్టార్ట్ చేశారు. అందులో.. కొందరు లేడీ ఫ్యాన్స్‌ ‘ఐ లవ్ యూ రణ్‌బీర్’ అంటూ గట్టిగా అరిచారు. అది విన్న రణ్‌బీర్ నవ్వుతూ వారి వైపు చూసి కన్నుకొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ ‘సో క్యూట్‌, ‘అతను చాలా అందంగా ఉన్నాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా మ్యాచ్ తర్వాత రణ్‌బీర్ తన ఫ్యాన్స్ దగ్గరకి వచ్చి సెల్ఫీలు, ఆటో‌గ్రాఫ్‌లు ఇచ్చాడు.



Updated Date - 2022-05-10T18:45:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!