సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మా కుటుంబంలో 10th class పాసైన మొదటి అబ్బాయిని నేనే.. షాకింగ్ నిజాలు భయటపెట్టిన Ranbir Kapoor

ABN, First Publish Date - 2022-07-10T18:33:22+05:30

కపూర్ కుటుంబ వారసుడిగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). 2007లో సినీ పరిశ్రమలోకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కపూర్ కుటుంబ వారసుడిగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). 2007లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ యువ నటుడు.. అనంతరం వరుసగా మంచి సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు పొందాడు. వరుసగా సూపర్ హిట్‌లు తీస్తూ హిందీ చిత్ర పరిశ్రమలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా ఉన్నాడు. ఈ యంగ్ హీరో తాజాగా నటించిన చిత్రం ‘షంషేరా (Shamshera)’. త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో మూవీటీం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ప్రమోషనల్ వీడియోలో రణ్‌బీర్, తన ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.


ఆ వీడియోలో ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ డోలీతో కలిసి సినిమా ప్రమోషన్స్ చేశాడు. అందులో డోలీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘నేను చదువులో చాలా వీక్. అందుకే 53.4 శాతం మాత్రమే వచ్చింది. అయితే.. నేను పాసవ్వడంతో సంతోషంగా ఫీల్ అయిన మా కుటుంబ సభ్యులు ఎంతో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఆ సమయంలో నా మీద వారికి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేవు. అంతేకాకుండా.. నా కుటుంబంలో పదో తరగతి పాసైన మొదటి అబ్బాయిని నేనే. అందుకే వారికి అంత ఆనందం’ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అంతేకాకుండా.. 2017లో సైతం ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘చదువుకు సంబంధించి మా కుటుంబ చరిత్ర అంత బాగా లేదు. మా నాన్న 8వ తరగతి, అంకుల్ 9వ తరగతి, తాత 6వ తరగతిలో ఫెయిల్ అయ్యారు. నిజానికి నా కుటుంబంలో ఎక్కువ చదువుకున్న అబ్బాయిని నేనే’ అని తెలిపాడు. పాఠశాల పూర్తి చేసిన తర్వాత, రణబీర్ 2007లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి ముందు విదేశాల్లో నటన, చిత్రనిర్మాణ ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే.. రణ్‌బీర్ తాజా చిత్రం ‘షంషేరా’ జులై 22న విడుదల కానుంది. వాణీ కపూర్ (Vaani Kapoor), సంజయ్ దత్ (Sanjay Dutt) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ అవ్వనుంది.



Updated Date - 2022-07-10T18:33:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!