సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సినిమా సెట్స్‌లో ఆ దర్శకుడు టార్చర్ చేసేవాడు: Ranbir Kapoor

ABN, First Publish Date - 2022-07-04T22:31:00+05:30

సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) తెరకెక్కించిన ‘సావారియా’ (Saawariya) సినిమా ద్వారా రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం 2007లో విడుదల కాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) తెరకెక్కించిన ‘సావారియా’ (Saawariya) సినిమా ద్వారా రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం 2007లో విడుదల కాగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భన్సాలీ తనను కొట్టేవాడని, మోకాళ్లపై కూర్చోబెట్టేవాడని రణ్‌బీర్ చెప్పాడు.  


నేహా ధూపియా (Neha Dhupia) 2016లో ‘నో ఫిల్టర్ విత్ నేహా’ (No Filter Neha) షోను నిర్వహించింది. ఆ షోలో భన్సాలీకి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను రణ్‌బీర్ తెలిపాడు. ‘‘సంజయ్ నాకు గురువు. సినిమాకు సంబంధించిన అనేక విషయాలను అతడి నుంచే నేర్చుకున్నాను. ప్రతి సీన్ సరిగ్గా రావాలనుకుంటాడు. అందుకోసం నన్ను కొట్టేవాడు. మోకాళ్లపై కూర్చోబెట్టేవాడు. ఒకానొక సమయంలో నాకు టార్చర్‌లా అనిపించింది. ‘సావారియా’ షూటింగ్ 10నెలల నుంచి 11నెలలు పూర్తయినప్పటికీ ఆ టార్చర్ భరించలేక వదిలిపెడదామని నిర్ణయించుకున్నాను. కానీ, నాకు నేను సర్ది చెప్పుకున్నాను. చిత్రాన్ని మధ్యలో వదిలివేయకూడదనుకున్నాను. ఆ సమయంలోనే నేను ఎమోషనల్, సెన్సిటివ్ అని నాకు అర్థమయింది’’ అని రణ్‌బీర్ చెప్పాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘బ్లాక్’ సినిమాకు కూడా రణ్‌బీర్ కపూర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. తాజాగా రణ్‌బీర్ కపూర్ ‘షంషేరా’ (Shamshera)లో నటించాడు. వాణీ కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. మరో భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmāstra)లోను కనిపించనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియాగా తెరకెక్కింది. హిందీతో పాటు సౌత్‌కు చెందిన అన్ని భాషల్లోను ఈ మూవీని విడుదల చేయనున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దక్షిణాది భాషల్లో ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2022-07-04T22:31:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!