Ranbir Kapoor: ఆ సినిమా ఫలితం నన్నెంతో బాధించింది

ABN , First Publish Date - 2022-12-08T23:16:35+05:30 IST

కుమార్తె రాహా పుట్టిన తర్వాత రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) మొదటిసారి పబ్లిక్‌గా కనిపించాడు..

Ranbir Kapoor: ఆ సినిమా ఫలితం నన్నెంతో బాధించింది

కుమార్తె రాహా పుట్టిన తర్వాత రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) మొదటిసారి పబ్లిక్‌గా కనిపించాడు. బ్లూ సూట్, గడ్డంతో సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ఈ హీరో తాజాగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రణ్‌బీర్ తన సినిమాల గురించి పంచుకున్నాడు.


‘షంషేరా’ (Shamshera) ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ.. ‘షంషేరా చాలా కష్టతరమైన చిత్రం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్. కానీ నేను గడ్డంతో నటించడమే పెద్ద పొరపాటు. చాలా వేడిలో షూటింగ్ చేశాం. ఆ సమయంలో గడ్డం ఉండడంతో వేడికి ముఖం కరిగిపోతుందేమోనని అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు. 


అలాగే.. తనే స్వయంగా నిర్మించి నటించిన చిత్రం ‘జగ్గ జసూస్’ గురించి కూడా రణ్‌బీర్ స్పందించాడు. ‘జగ్గా జసూస్ (Jagga Jasoos) నేను నిర్మించిన చిత్రం. ఎంతో నచ్చి ఆ సినిమా చేశాను. దానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ఆ సినిమా కానెప్ట్ హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. మంచి ఐడియా కూడా. కానీ అది బాగా ఆడలేదు. ఆ సినిమా ఫెయిల్యూర్ నన్ను చాలా బాధించింది. నా కెరీర్‌లోనే నన్నెంతో బాధించిన సినిమా అదే’ అని రణ్‌బీర్ తెలిపాడు.


అయితే.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’తో రణ్‌బీర్ విజయాన్ని దక్కించుకున్నాడు. ఆ సినిమా ఆయన భార్య ఆలియా భట్‌ హీరోయిన్‌గా నటించింది. కాగా.. రణబీర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్‌’లో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్. అలాగే లవ్ రంజన్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్‌తో కలిసి ఓ రొమ్ కామ్ మూవీ చేస్తున్నాడు.

Updated Date - 2022-12-08T23:16:35+05:30 IST