హీరోను కిస్ చేసిన Ranbir Kapoor
ABN , First Publish Date - 2022-07-17T00:44:27+05:30 IST
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన సినిమా ‘యే జవానీ హై దివానీ’ (Yeh Jawaani Hai Deewani). 2013లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన సినిమా ‘యే జవానీ హై దివానీ’ (Yeh Jawaani Hai Deewani). 2013లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapur) బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించారు. తాజాగా వీరిద్దరూ ఓ అవార్డ్స్ ఫంక్షన్‌కు వేర్వేరుగా హాజరయ్యారు. ఆ సమయంలో ఎదురెదురుగా తారసపడి అభిమానులను జ్ఞాపకాల్లో ముంచెత్తారు.
రణ్‌బీర్ కపూర్ ముందుగా అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరయ్యాడు. కెమెరాలకు ఫోజులిస్తున్న క్రమంలో ఆదిత్య రాయ్ కపూర్ అక్కడికి వచ్చాడు. ఆదిత్యను చూసిన వెంటనే రణ్‌బీర్ ఉత్సాహానికి లోనయ్యాడు. హే బ్రో అని పిలిచాడు. అనంతరం ఇద్దరు కౌగిలించుకున్నారు. కాసేపు ముచ్చటించుకున్నారు. ఇద్దరు కలసి కెమెరాలకు ఫోజులిచ్చారు. రణ్‌బీర్ కొంచెం ఉత్సాహానికి లోనయి ఆదిత్యకు ముద్దు కూడా పెట్టాడు. అప్పుడు అందరు బన్నీ, అవీ అని అరవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ‘యే జవానీ హై దివానీ’ లో రణ్‌బీర్, ఆదిత్యల పేర్లు ఇవే. నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో అనేక మంది నెటిజన్స్ ఈ వీడియో కింద కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ‘‘సూపర్ హిట్ జోడీ’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘10ఏళ్ల అనంతరం వీరు కలుసుకున్నారు’’ అని మరో నెటిజన్ స్పందించాడు. ‘యే జవానీ హై దివానీ’ లో దీపికా పదుకొణె, కల్కి కొచ్లిన్, కునాల్ రాయ్ కపూర్ కీలక పాత్రలు పోషించారు.