Brahmastra: రణబీర్, ఆలియా పారితోషికం తీసుకోలేదా..?
ABN , First Publish Date - 2022-09-23T20:38:14+05:30 IST
బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. దాదాపు
బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. దాదాపు పదేళ్లు ఈ సినిమా స్క్రిఫ్ట్‌పై పనిచేశాడు. సెలబ్రిటీ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరో, హీరోయిన్లుగా నటించారు. ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్‌స్టార్ స్టూడియోస్, ప్రైమ్ ఫోకస్ వంటి సంస్థలు కలసి నిర్మించాయి. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.360కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రూ.650కోట్ల భారీ బడ్జెట్‌తో ‘బ్రహ్మాస్త్ర’ ను నిర్మించారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ మూవీ చేసినందుకు రణ్‌బీర్, ఆలియా ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని వదంతులు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా అయాన్ ముఖర్జీ, రణ్‌బీర్ కపూర్ ఈ విషయంపై స్పందించారు.
‘బ్రహ్మస్త్ర’ లాంగ్ రన్ గురించి ఆలోచించి రూపాయి కూడా తీసుకోలేదని రణ్‌బీర్ చెప్పాడు. ‘బ్రహ్మాస్త్ర’ కు నిర్మాతగా వ్యవహరించానన్నాడు. ఈ సినిమా మూడు భాగాలుగా రూపొందుతుందని నమ్మకం ఉందన్నాడు. అందువల్లే మొదటి పార్ట్ చేసేందుకు రూపాయి కూడా తీసుకోలేదని తెలిపాడు. దర్శకుడైన అయాన్ ముఖర్జీ ఈ విషయంపై మాట్లాడాడు. ‘‘నిజం చెప్పాలంటే ఈ సినిమా కోసం చాలా వ్యక్తిగత విషయాలను త్యాగం చేయాల్సి వచ్చింది. రణ్‌బీర్ లేకపోతే సినిమా పూర్తయ్యేది కాదు. అయినప్పటికి, అతడు రూపాయి కూడా తీసుకోలేదు. ఆలియా ఈ సినిమాను చేసేందుకు 2014లోనే అంగీకరించింది. అప్పటికి, ఆమె బిగ్ స్టార్ కాదు. ఆలియాకు కొంత మొత్తం చెల్లిస్తామన్నాం. ఆమె కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు’’ అని అయాన్ ముఖర్జీ తెలిపాడు. ‘బ్రహ్మాస్త్ర’ లో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్, షారూఖ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది.