సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రకుల్ నుంచి 2022లో 7 సినిమాలు.. ఫైలెట్, గైనకాలజిస్ట్, కండోమ్ టెస్టర్ వంటి విభిన్న రకాల పాత్రలు..

ABN, First Publish Date - 2022-01-19T23:53:33+05:30

టాలీవుడ్‌తో పాటు, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఆమె నటించిన 7 సినిమాలు 2022లో విడుదల కానున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌తో పాటు, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఆమె నటించిన  7 సినిమాలు 2022లో విడుదల కానున్నాయి. విడుదల కాబోయే వాటిలో 6 హిందీ సినిమాలు కావడం విశేషం. ఆయుష్మాన్ ఖురానా సరసన ‘‘డాక్టర్ జీ’’, అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘‘రన్ వే-34’’, అజయ్ దేవగణ్, సిద్దార్థ్ మల్హోత్రాల సరసన ‘‘థ్యాంక్ గాడ్’’, ‘‘ఛత్రీవాలీ’’, ‘‘అటాక్‌’’లతో పాటు ఒక టైటిల్ పెట్టని చిత్రంలోను ఆమె నటిస్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూలో అనేక విషయాలను అభిమానులతో పంచుకుంది.


‘‘ నా కెరీర్లో 2022 బాగుంటుందని ఆశిస్తున్నాను. నేను నటించిన 7 చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. వీటిలో 6 బాలీవుడ్‌కి చెందినవి. విడుదల కాబోయే చిత్రాన్నింటిని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ అన్ని సినిమాల్లో విభిన్న రకాల పాత్రలను పోషించాను. ప్రతి సినిమా కొత్త జోనర్‌లో తెరకెక్కింది. ‘అటాక్’ సైన్స్ ఫిక్షన్స్‌గా చిత్రం. ‘రన్ వే-34’లో ఫైలెట్ పాత్రలో కనిపిస్తాను. ‘డాక్టర్-జీ’లో గైనకాలజిస్ట్‌, ‘ఛత్రివాలీ’‌లో కండోమ్ టెస్టర్‌ పాత్రను పోషించాను. గత 2ఏళ్లు ఈ సినిమాల షూటింగ్ కొనసాగింది. థియేటర్లల్లో ఈ చిత్రాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురు చూస్తున్నాను’’ అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. 

Updated Date - 2022-01-19T23:53:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!