Rakhi Sawant: ఇప్పటికే చాలా అనుభవించాడు.. ఇలాగే చేస్తే సాజిద్ ఖాన్ ఆత్మహత్య చేసుకుంటాడు

ABN , First Publish Date - 2022-10-14T19:20:02+05:30 IST

బాలీవుడ్ దర్శకుడు, కమెడియన్, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ (Sajid Khan)పై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే..

Rakhi Sawant: ఇప్పటికే చాలా అనుభవించాడు.. ఇలాగే చేస్తే సాజిద్ ఖాన్ ఆత్మహత్య చేసుకుంటాడు

బాలీవుడ్ దర్శకుడు, కమెడియన్, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ (Sajid Khan)పై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తమను లైంగిక వేధింపులకు గురి చేశాడని మీటూ మూవ్‌మెంట్‌లో భాగంగా పలువురు మంది మహిళలు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని ఎలా బిగ్‌బాస్ (Bigg Boss) రియాలిటీ షోకి తీసుకొస్తారని విమర్శలు కూడా చేశారు. అందులో మందనా కరిమి, సోనా మహపాత్ర, ఉర్ఫీ జావేద్, నేహా భాసిన్, తన శ్రీ దత్తా వంటి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు. అయితే.. అందుకు విరుద్ధంగా బాలీవుడ్ నటి, బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్ (Rakhi Sawant) మాత్రం సాజిద్ సపోర్టుగా మాట్లాడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. ‘నిజంగా చెప్పాలంటే, సాజిద్ ఖాన్ గత నాలుగేళ్ల పాటు శిక్షను అనుభవించాడు. అప్పుడు ఎవరూ ఎందుకు గొంతు ఎత్తలేదు?. అతను బిగ్ బాస్‌కి వెళ్లి హైలైట్ అవుతున్నాడు. కాబట్టి ఇప్పుడు

అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకే అతనిపై విమర్శలు చేస్తున్నారు. అతను దోషా లేదా నిర్దోషా అని నేను చెప్పలేను. అది నాకు తెలియదు. కానీ.. గత నాలుగేళ్లుగా అతని సరైన వర్క్, అవకాశాలు రాలేదని మాత్రం తెలుసు.


అంటే.. అతనికి ఇప్పటికే శిక్ష పడింది. ఆ నాలుగేళ్లు అతను పబ్లిక్‌లో లేడు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు బిగ్ బాస్‌కి వెళ్లి హైలెట్ అవుతుంటే సరికి.. వారి పబ్లిసిటీ కోసం ఏదెదో మాట్లాడుతున్నారు. అవన్నీ వదిలేసి.. అతన్ని అతని మానాన బతకనివ్వండి. అలాగే.. బిగ్‌ బాస్‌లో అలాంటి వివాదాస్పద వ్యక్తులనే కంటెస్టెంట్స్‌గా తీసుకుంటారు. ఒక వేళ నేను బిగ్ బాస్‌కి వెళితే కచ్చితంగా ఆరోపణలు నిజమో కాదో అడిగి తెలుసుకుంటాను. విమర్శలు ఇలాగే కొనసాగితే సాజిద్ ఆత్మహత్య (Suicide) చేసుకునే అవకాశాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చింది.Updated Date - 2022-10-14T19:20:02+05:30 IST

Read more