సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rakesh Roshan: ఆ పాత బాలీవుడ్‌లో మూవీ కథతోనే ‘బాహుబలి‌’ని తీశారు.. కానీ..

ABN, First Publish Date - 2022-09-06T19:50:36+05:30

‘క్రిష్(Krrish)’ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ రోషన్ (Rakesh Roshan).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘క్రిష్(Krrish)’ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్  దర్శకుడు రాకేశ్ రోషన్ (Rakesh Roshan). ఆయన కొడుకు హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన ఆ చిత్రానికి దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా.. అవన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ తరుణంలో ‘క్రిష్ 4’ త్వరలో పట్టాలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో రాకేశ్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ సినిమాల ఫెయిల్యూర్‌పై స్పందించాడు.


రాకేశ్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌ (Bollywood) ఫిల్మ్ మేకర్స్ తాము, తమ స్నేహితులు చూడటానికి ఇష్టపడే సినిమాలను చేస్తున్నారు. అలాంటి దేశంలో చాలా తక్కువ మంది ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతాయి. మిగిలిన ప్రేక్షకులకు వాటితో అసలు సంబంధమే ఉందదు. అలాంటి సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. అందుకే హిందీ సినిమాలు బాక్సాఫిస్ వద్ద పెద్దగా రాణించలేకపోతున్నాయి.


దక్షిణాది సినిమాలు ఆడటం గురించి రాకేశ్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికీ జనాల జీవితాలను చూపించే కథలకు దక్షిణాది దర్శకులు, నిర్మాతలు కట్టుబడి ఉన్నారు. కమర్షియల్ సెన్సిబిలిటీలను దృష్టిలో ఉంచుకుని చాలా అప్‌గ్రేడ్‌గా ప్రదర్శిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి లాంటి సినిమాలు చూస్తే అలాంటి కథే ఉంటుంది. బాహుబలి కరణ్ అర్జున్‌ని పోలి ఉంటుంది. కానీ దాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. పాటలను కూడా భారీ స్థాయి చూపించారు. అందువల్ల ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరించారు. కానీ.. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ భారతీయత మూలాలకు దూరమయ్యారు. ఆధునిక సినిమా పేరుతో చెత్తని తెరమీదకి తెస్తున్నారు. అది కేవలం ఒక శాతం జనాభాకి మాత్రమే నచ్చుతుంది. ఆ సినిమాలు బి, సి సెంటర్ల ప్రేక్షకులకి అంతగా ఎక్కడం లేదు. కాబట్టి వాటికి అనుగుణంగా కథని ఎంచుకుని తీస్తే కచ్చితంగా ఆదరిస్తారు’ అపి తెలిపాడు.

Updated Date - 2022-09-06T19:50:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!