ఒక్క Parle-G బిస్కెట్ ప్యాకెట్ తిని రోజంతా ఉండేవాడిని: Rajkummar Rao

ABN , First Publish Date - 2022-07-08T00:29:33+05:30 IST

బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రాజ్ కుమార్ రావ్ (Rajkummar Rao). ‘క్వీన్’, ‘న్యూటన్’ (Newton), ‘స్త్రీ’, ‘లూడో’ వంటి చిత్రాలతో

ఒక్క Parle-G బిస్కెట్ ప్యాకెట్ తిని రోజంతా ఉండేవాడిని: Rajkummar Rao

బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రాజ్‌కుమార్ రావ్ (Rajkummar Rao). ‘క్వీన్’, ‘న్యూటన్’ (Newton), ‘స్త్రీ’, ‘లూడో’ వంటి చిత్రాలతో అభిమానులను అలరించాడు. ఈ మధ్యనే ‘బధాయి దో’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా అతడు మీడియాలో మాట్లాడాడు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులకు తెలిపాడు. 


ముంబైలో గతంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను రాజ్‌కుమార్ రావ్ వివరించాడు. ‘‘బయటి వ్యక్తిగా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించడం కష్టం. గుర్గావ్‌లోని ఓ చిన్న గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో నేను పెరిగాను. అప్పుడే సినిమాలపై ప్రేమను పెంచుకున్నాను. ఈ రంగంలోనే స్థిరపడాలనుకున్నాను. ప్రతి రోజు సైకిల్‌పై ఢిల్లీకి 70కిమీ ప్రయాణించేవాడిని. థియేటర్ చేసేవాడిని. థియేటర్ చేస్తున్నప్పుడే చాలా విషయాలు నేర్చుకున్నాను. అనంతరం ముంబైకి మారాను. ఆ సమయం చాలా కష్టంగా గడిచింది. ఒక్క పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్ తిని రోజంతా ఉండేవాడిని. నా బ్యాంక్ అకౌంట్‌లో అప్పుడు రూ.18 మాత్రమే ఉన్నాయి. నాకు ఆ సమయంలో ప్లాన్ బీ లేదు. ఎల్లప్పుడు నటుడిగా మారాలని ఆలోచించేవాడని’’ అని రాజ్‌కుమార్ రావ్ చెప్పాడు. రాజ్‌కుమార్ రావ్ ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా’ (Love Sex Aur Dhoka), ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్’ (Ragini MMS) లో కొత్త రకం పాత్రలు పోషించి అనేక రూల్స్‌ను బ్రేక్ చేశాడు. ఆస్కార్ నామినేటెడ్ ఫిలిం ‘ద వైట్ టైగర్’ (The White Tiger) లోను ఓ పాత్రలో దర్శనమిచ్చాడు. తాజాగా ‘హిట్: ద ఫస్ట్ కేస్’ (Hit:The First Case) లో నటించాడు. సాన్యా మల్హోత్రా హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ హిట్ మూవీ ‘హిట్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఒరిజినల్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన శైలేష్ కొలనే రీమేక్‌ను కూడా డైరెక్షన్ చేశాడు. ఈ చిత్రం జులై 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. 

Updated Date - 2022-07-08T00:29:33+05:30 IST

Read more