సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rajesh Khanna: ఆయన పోస్ట్ బాక్స్ నిండా రక్తంతో రాసిన ప్రేమలేఖలే!

ABN, First Publish Date - 2022-12-29T15:23:06+05:30

బాలీవుడ్‌కి సూపర్ స్టార్ అనే పదాన్ని పరిచయం చేసిన నటుడు రాజేశ్ ఖన్నా. ఆయన తర్వాత ఎంతమంది సూపర్ ‌స్టార్స్ వచ్చినా.. మొట్టమొదటి సూపర్‌స్టార్‌గా ఆయన బీ టౌన్ చరిత్రలో నిలిచిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌కి సూపర్ స్టార్ (Super Star) అనే పదాన్ని పరిచయం చేసిన నటుడు రాజేశ్ ఖన్నా (Rajesh Khanna). ఆయన తర్వాత ఎంతమంది సూపర్ ‌స్టార్స్ వచ్చినా.. మొట్టమొదటి సూపర్‌స్టార్‌గా ఆయన బీ టౌన్ (Bollywood) చరిత్రలో నిలిచిపోయారు. దశాబ్ధ కాలం పాటు వరుసగా సూపర్ హిట్లతో హిందీ చిత్ర పరిశ్రమని ఏలారు. ఆయన సినిమాలతో ఎంత ఫేమస్సో.. ఎఫైర్స్‌తోనూ అంటే పాపులారిటీ సాధించారు. నేడు (డిసెంబర్ 29న) ఈ సూపర్ స్టార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం..

రాజేశ్ ఖన్నా అసలు పేరు జతిన్ ఖన్నా (Jatin Khanna). డిసెంబర్ 29, 1942న జన్మించిన ఈ నటుడు 1966లో ‘ఆఖ్రీ ఖత్’ (Aakhri Khat) అనే సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. ఈ సినిమాని 1967లో జరిగిన ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి భారతదేశం తరుపున అధికారిక ఎంట్రీగా పంపారు. 1970 - 80ల మధ్యలో ఆయన చేసిన 15 సినిమాలు విజయవంతం కావడంతో సూపర్‌స్టార్‌గా మారిపోయారు. అయితే 1980 తర్వాత ఆయన కెరీర్ గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. ఆయన సినిమాలు వరుస పరాజయాలను చవిచూశాయి. ఎంత త్వరగా ఎదిగి సూపర్ స్టార్ అయ్యారో అంతే త్వరగా కిందపడిపోయారు.

అయితే రాజేశ్ ఖన్నా సూపర్‌స్టార్‌గా ఉన్న సమయంలో ఆయన క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. ఆ సమయంలో ఎంతోమంది అమ్మాయిలు ఆయనంటే పడి చచ్చిపోయేవారు. ఖన్నాని కలిసేందుకు, మాట్లాడేందుకు ఆయన ఇంటి ఎదుట పడిగాపులు కాసేవారు. అయితే అందరికీ ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. అందుకే ఆయన వాడే కారుకి ఉన్న దుమ్ముని ఒంటికి రాసుకునేవారు. మరికొందరు అమ్మాయిలయితే ఆ కారుకి ముద్దులు పెట్టేవారు. దాంతో ఎప్పుడు చూసిన ఆయన కారుకి లిప్‌స్టిక్ గుర్తులు ఉండేవి. అంతేకాదు.. రక్తంతో రాసిన ప్రేమలేఖలతో ఆయన ఇంటి ముందు ఉండే పోస్ట్ బాక్స్ నిండిపోయేదట. ఆయన షూటింగ్ చేసే ప్రాంతంలో అభిమానులను అడ్డుకోవడం దుర్లభమయ్యేదని చెబుతారు.

ఈ స్టార్ 1973లో నటి డింపుల్ కపాడియాని పెళ్లి చేసుకున్నారు. అప్పటికీ ఆయన వయస్సు 31 కాగా.. ఆమెకి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. వారికి ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా అనే ఇద్దరు పిల్లలు కలిగారు. అయితే రాజేశ్ ఖన్నా పెళ్లి చేసుకున్నందుకు ఎంతోమంది కాలేజ్ అమ్మాయిలు డింపుల్‌ని శత్రువులా భావించేవారట. పెళ్లి తర్వాత కూడా రాజేశ్‌కి పలువురితో ఎపైర్లు ఉండేవని బాలీవుడ్‌లో టాక్ ఉండేది. అంజు మెహెందారు, టీనా అంబానీ, అనిత అడ్వాణీ వంటి పలువురితో ఆయన ఎఫైర్ నడిపారట. 1980 తర్వాత స్టార్‌డమ్ కోల్పోవడంతో దాన్ని మర్చిపోవడానికి ఎప్పుడు తాగుతూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్‌ రావడంతో చికిత్స పొందుతూ 12 జూలై 2012లో మరణించారు.

Updated Date - 2022-12-29T17:37:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!