Vijay Devarakonda తర్వాత హాట్ టాపిక్‌గా మారిన Rahul Khanna న్యూడ్ ఫొటో.. నెటిజన్ల కామెంట్స్‌ను చూస్తే..!

ABN , First Publish Date - 2022-07-19T21:05:37+05:30 IST

బాలీవుడ్‌‌లో విలన్ పాత్రలు చేస్తూ హీరోలతో సమానంగా అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా గుర్తింపు పొందిన నటుడు వినోద్ ఖన్నా..

Vijay Devarakonda తర్వాత హాట్ టాపిక్‌గా మారిన Rahul Khanna న్యూడ్ ఫొటో.. నెటిజన్ల కామెంట్స్‌ను చూస్తే..!

బాలీవుడ్‌‌లో విలన్ పాత్రలు చేస్తూ హీరోలతో సమానంగా అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా గుర్తింపు పొందిన నటుడు వినోద్ ఖన్నా (Vinod Khanna). ఈయన అనంతరం రాజకీయల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచారు. ఓసారి కేంద్రమంత్రిగా సైతం పనిచేశారు. అంత పాపులారిటీ ఉన్న ఈయన పెద్ద కుమారుడు రాహుల్ ఖన్నా (Rahul Khanna) లైమ్‌లైట్‌కు చాలా దూరంగా ఉంటూ ఉంటాడు. అయితే.. రాహుల్ సైతం నటుడే. అంతేకాకుండా మంచి రచయితకూడా. అయినప్పటికీ బయట ఎక్కువగా కనిపించడానికి ఇష్టపడడు. కానీ తాజాగా సోషల్ మీడియా చేసిన పోస్ట్ రాహుల్ పేరు నెట్టింట మారుమోగిపోయేలా చేసింది. 


రాహుల్ ట్వీట్టర్‌లో చేసిన పోస్ట్‌లో ఓ పిక్‌ని షేర్ చేశాడు. అందులో.. ఓ సోఫాలో కూర్చున్న రాహుల్ బట్టలు లేకుండా దాదాపు నగ్నంగా ఉన్నాడు. ‘లైగర్’ సినిమా పోస్టర్‌లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పూలగుత్తిని అడ్డుపెట్టుకున్నట్లు.. ఈ రచయిత సైతం ఓ దిండుని అడ్డుగా పెట్టుకున్నాడు. ఈ పోస్ట్‌కి.. ‘నేను మూటగట్టుకున్నది ఏదో ఉంది. దాన్ని బయట పెట్టే సమయంలో వచ్చింది. రేపు ఓ పెద్ద విషయాన్ని బయటపెట్టబోతున్నా.. దాని కోసం వేచి ఉండండి’ అని రాసుకొచ్చాడు.


అయితే.. ఓ పురుషులకి సంబంధించిన వస్తువులను ప్రమోట్ చేయడంలో భాగంగా రాహుల్ ఇలాంటి పిక్‌‌ని షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో దీనిపై నెటిజన్ల నుంచి స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. ‘ఎలాంటి మనుషులు ఉన్నారు. అర్థనగ్నంగా కనిపిస్తూ ఏదో సాధించినట్లు ఫీల్ అవుతున్నారు’ అని ఓ నెటిజన్.. ‘ఇలా అర్థనగ్నంగా ఉండి పోజులివ్వడం ఓకే అయితే ఇక సిగ్గుపడాల్సిన పని ఏముంది. బహిరంగంగా అన్ని చేయండి’ అంటూ మరొకరు.. ‘ఇలాంటి పబ్లిక్ డోమైన్‌లో అలాంటి ఛండాల పనులు చేయకు’ అంటూ ఇంకొకరు కామెంట్స్ చేశారు.



Updated Date - 2022-07-19T21:05:37+05:30 IST