అందం కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు.. నాకు దక్కాల్సిన పాత్రలు వేరే వాళ్లకు.. అంటూ Radhika Apte కామెంట్స్

ABN , First Publish Date - 2022-06-01T19:22:35+05:30 IST

ప్యాడ్‌మాన్, అంధాధున్, పార్చుడ్‌ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు పొందిన నటి రాధికా ఆప్టే..

అందం కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు.. నాకు దక్కాల్సిన పాత్రలు వేరే వాళ్లకు.. అంటూ Radhika Apte కామెంట్స్

ప్యాడ్‌మాన్, అంధాధున్, పార్చుడ్‌ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు పొందిన నటి రాధికా ఆప్టే. లెజెండ్, కబాలి వంటి సినిమాలతో సౌత్ ఇండియాలోనూ పాపులారిటీ సాధించింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటి కరోనా మహమ్మారి ముందు అవకాశాలు కోల్పోయిన తీరును తెలిపింది. అంతేకాకుండా అందం కోసం సర్జరీలు చేయించుకునే నటీమణులు ఆ ప్రాజెక్టులను సొంతం చేసుకున్నారని ఓ ఇంటర్వ్యూలో విమర్శించింది.


రాధిక మాట్లాడుతూ.. ‘కోవిడ్ -19కి ముందు నేను చాలా నిరాశకు గురయ్యాను. ఎందుకంటే నేను చేయాలనుకున్న పలు ప్రాజెక్టులు ఇతరులు దగ్గరకి వెళ్లాయి. అదోరకంగా కనిపించేవారు సెక్సీ ఈమేజీ కారణంగా నా అవకాశాలను కొల్లగొట్టుకుపోయారు. అలా యువ నటులు నా ప్రాజెక్టులను పొందడంతో కొంచెం నిరుత్సాహానికి గురయ్యాను’ అని చెప్పుకొచ్చింది.


సినిమా ఇండస్ట్రీలో అందంగా కనిపించడానికి సర్జరీలు చేసుకోవడం మామూలే. ఎందరో నటీనటులు అలాంటి చికిత్సలు చేయించుకున్నారు. అయితే.. రాధికకి మాత్రం ఇలాంటివి ఇష్టం ఉండదు. సహజంగానే ముసలితనం రావాలని కోరుకుంటున్నట్లు ఈ నటి ఓ సందర్భంలో చెప్పింది. దీంతో సర్జరీలు చేసుకునే నటుల గురించి రాధిక మాట్లాడుతూ.. ‘వయస్సును తగ్గించుకోవడానికి పరిశ్రమలోని కొందరు వ్యక్తులు శస్త్రచికిత్సలు చేయించుకోవడం చూశాను. అంతెందుకు నా సహోద్యోగుల్లో చాలామంది తమ ముఖాలను, శరీరాలను అందంగా మార్చుకోవడానికి పలు రకాల శస్త్రచికిత్సలు చేసుకున్న వారి గురించి నాకు తెలుసు. బయట బాడీ పాజిటివిటీ గురించి ఎక్కువగా మాట్లాడే వారే స్వయంగా సర్జరీలు చేయించుకుంటున్నారు. అలాంటి వారితోనే కెరీర్ పరంగా నాకు సవాలు ఎదురవుతోంది’ అని తెలిపింది.

Updated Date - 2022-06-01T19:22:35+05:30 IST

Read more