సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అటువంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. వైరల్‌గా మారిన రష్మిక తాజా కామెంట్స్..

ABN, First Publish Date - 2022-02-16T20:52:56+05:30

అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న నటి రష్మిక మందన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న నటి రష్మిక మందన్న. ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా కూడా రష్మిక గుర్తింపు పొందింది. ‘ఛలో’ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘గీత  గోవిందం’, ‘దేవదాస్’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోను వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 


రష్మిక గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాల రీత్యా వార్తల్లోకెక్కుతోంది. విజయ్ దేవరకొండతో ఆమె డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, ఈ వదంతులను వీరిద్దరూ కూడా ఖండించారు. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో లవ్, రిలేషన్ షిప్, తనకు కాబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను గురించి చెప్పింది.


ప్రేమను మాటల్లో వర్ణించలేమంది. అది ఒక భావ వ్యక్తీకరణ మాత్రమే అని పేర్కొంది. ఒకరికి మరొకరు విలువైన సమయం, గౌరవం ఇచ్చిపుచ్చుకున్నప్పుడు మాత్రమే అది ప్రేమ అని చెప్పింది. పెళ్లి గురించి కూడా తన ఆలోచనలను పంచకుంది. ‘‘ ప్రస్తుతానికి నా వయసు చిన్నది కాబట్టి పెళ్లి గురించి ఏవిధంగా ఆలోచించాలో నాకు తెలియదు. పెళ్లికి సంబంధించిన ఆలోచనని కూడా నా మనసులోకి రానీయలేదు. నన్ను ఎవరు సురక్షితంగా చూసుకుంటారో వారిని పెళ్లి చేసుకుంటాను’’ అని రష్మిక మందన్న చెప్పింది. 

Updated Date - 2022-02-16T20:52:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!