సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Road accident: పాపులర్ సింగర్‌కి గాయాలు.. దేవుడిని చూశానంటూ..

ABN, First Publish Date - 2022-07-20T17:50:21+05:30

ప్రముఖ పంజాబీ గీత రచయిత, గాయకుడు జానీ జోహన్ మంగళవారం (జులై 19) సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ పంజాబీ గీత రచయిత, గాయకుడు జానీ జోహన్ (Jaani Johan) మంగళవారం (జులై 19) సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పంజాబ్‌లోని మొహాలీలో ఆయన కారు, మరో కారుని ఢీకొట్టింది. దీంతో ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు సైతం గాయపడ్డారు.


ప్రమాదానికి ప్రధాన కారణం రెడ్ సిగ్నల్ (Red signal) జంప్ చేయడమని పోలీసులు చెబుతున్నారు. ఆ కారణంగానే ఎస్‌యూవీ, ఫోర్డ్ ఫిగో ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఢీకొన్న సమయంలో కార్లు చాలాసార్లు పల్టీలు కొట్టినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జానీని, ఆయన ఇద్దరు స్నేహితులను వెంటనే మొహాలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో కారులోని ప్రయాణికులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. జానీకి మెడ, వీపుపై గాయాలయ్యాయి. జానీ ప్రమాదం గురించి తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.


చికిత్స అనంతరం తనకు జరిగిన ప్రమాదంపై ఇన్‌స్టాగ్రామ్‌‌లో జానీ స్పందించాడు. జానీ చేసిన పోస్టులో.. ‘దేవుడి దయవల్ల, ప్రమాద సమయంలో కారులో ఉన్న మేమంతా చాలా బావున్నాం. ఈ విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవడంతో త్వరగానే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాం’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా.. ఈ పోస్టుకి.. ‘ఈరోజు నా కళ్లతో మరణాన్ని చూశాను. అలాగే వెంటనే దేవుడిని కూడా చూశాను. అంటే.. నేను మరణాన్ని, దేవుడిని కలిపి చూశాను. నేను, నా స్నేహితులు క్షేమంగా ఉన్నాం. మాకు చిన్నపాటి గాయాలయ్యాయి. మా కోసం ప్రార్థనలు చేయండి’ అంటూ రాసుకొచ్చాడు.



Updated Date - 2022-07-20T17:50:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!