ఇవి అసలు సినిమాలేనా..? Dhaakad నుంచి Samrat Prithviraj వరకు బాలీవుడ్‌లో ఫ్లాపులపై నిర్మాత సంచలన కామెంట్స్..

ABN , First Publish Date - 2022-06-16T21:04:41+05:30 IST

సినిమా పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కరోనా అనంతరం ప్రేక్షకుల అభిరుచుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అందరు ఓటీటీలకే పరిమితమైపోతున్నారు. ప్రజలను థియేటర్స్‌కు

ఇవి అసలు సినిమాలేనా..? Dhaakad నుంచి Samrat Prithviraj వరకు బాలీవుడ్‌లో ఫ్లాపులపై నిర్మాత సంచలన కామెంట్స్..

సినిమా పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కరోనా అనంతరం ప్రేక్షకుల అభిరుచుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అందరు ఓటీటీలకే పరిమితమైపోతున్నారు. ప్రజలను థియేటర్స్‌కు తీసుకురావడం కష్టమైపోతుంది. కథ బాగుంటేనే సినిమాహాళ్లకు వస్తున్నారు. బాలీవుడ్‌తో సహా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా అందుకు మినహాయింపు ఏమీ కాదు. బీ టౌన్ బాక్సాఫీస్ వద్ద ‘సూర్యవంశీ’ (Sooryavanshi), 'గంగూబాయి కతియావాడి' (Gangubai Kathiawadi), ‘ద కశ్మీర్ ఫైల్స్’(The Kashmir Files)తో సహా మరికొన్ని చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి. ‘బచ్చన్ పాండే’, ‘జెర్సీ’, ‘ధాకడ్’(Dhaakad), ‘సామ్రాట్ పృథ్వీరాజ్’(Samrat Prithviraj) వంటి సినిమాలు పరాజయం పాలయ్యాయి. తాజాగా బాలీవుడ్ మూవీస్ వరుసగా ప్లాప్ అవ్వడంతో స్టార్ ప్రొడ్యూసర్ ముకేశ్ భట్ (Mukesh Bhatt) తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు.  


ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా నిర్మాతలు మారాలని ముకేశ్ భట్ చెప్పాడు. ‘‘అందరు ఓటీటీ కంటెంట్‌ని చూస్తున్నారు. మంచి కథ ఉంటెనే ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారు. గతంలో మనం నిర్మించిన సినిమాలతో అభిమానులు సంతృప్తి చెందేవారు. ప్రస్తుతం ఆ పరిస్థతి లేదు. కరోనా అనంతరం వారి అభిరుచుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అందువల్ల కాలంతో పాటు మనం కూడా మారాలి. తరాలు మారుతున్న ఇండస్ట్రీ మారడం లేదు. ఇండస్ట్రీ మారకపోతే మనుగడ సాగించడం కష్టం. బాలీవుడ్ ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. సెటప్‌లు రూపొందిస్తుంది. ఆ సెటప్‌లు హిట్ కావు. చిత్రాలు మాత్రమే విజయాన్ని సాధిస్తాయి. సినిమాను ‘X’ అమౌంట్‌కు రూపొందించి, ‘Y’ కీ అమ్మి, ‘Z’ అమౌంట్‌ను జేబులో వేసుకోవాలనుకుంటున్నారు. నీతి, నిజాయతీలేకుండా వ్యాపారం చేస్తున్నారు. ఇటువంటి వ్యాపారాలు నేను చేయను. నాకు కథ నచ్చితేనే సినిమాలు రూపొందిస్తాను’’ అని ముకేశ్ భట్ తెలిపాడు.

Updated Date - 2022-06-16T21:04:41+05:30 IST