బిడ్డ కోసం ముందే ప్లాన్ చేసిన ప్రియాంక దంపతులు.. భారీ మొత్తంతో ఇల్లు కొనుగోలు.. ధర తెలిస్తే షాకే..

ABN , First Publish Date - 2022-01-28T00:31:14+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు జనవరి 15న తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే.

బిడ్డ కోసం ముందే ప్లాన్ చేసిన ప్రియాంక దంపతులు.. భారీ మొత్తంతో ఇల్లు కొనుగోలు.. ధర తెలిస్తే షాకే..

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు జనవరి 15న తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తాము సరోగసీ ద్వారా బిడ్డకు అమ్మానాన్నలయ్యామని సోషల్ మీడియా వేదికగా వారు ప్రకటించారు. తమ జీవితంలోకి కొత్తగా ఒక పాప రావడంతో ఆ దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే.. పుట్టబోయే బుజ్జాయిని దృష్టిలో ఉంచుకొని వారు గతంలోనే ఒక ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. భారీ ధరను చెల్లించి ఆ ఇంటిని సొంతం చేసుకున్నారని వార్తలొస్తున్నాయి. 


‘‘కాలిఫోర్నియాలో 2019లో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఒక ఇంటిని కొనుగోలు చేశారు. పిల్లలను దృష్టిలో ఉంచుకొని ఆ భవంతిని కొన్నారు. తమ జీవితంలోకి రాబోయే బుజ్జాయి ఆడుకునేందుకు ఖాళీ స్థలంతో పాటు పచ్చదనం ఉండాలని వారు భావించారు. అందుకే 20 మిలియన్ డాలర్లు వెచ్చించి ఈ దంపతులు ఇంటిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత తమకు నచ్చినట్టు ఇంట్లో మార్పులు చేయించారు. తమ పిల్లలతో ఆ ఇంట్లో గడిపే ప్రతి క్షణాన్ని మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోవాలనుకుంటున్నారు. అందుకే అంత భారీ ధర‌ను చెల్లించారు. దీని ధర భారత కరెన్సీలో రూ.150కోట్లు ఉంటుంది. కాలిఫోర్నియాలో జరిగిన ఖరీదైన కొనుగోళ్లలో ఇది కూడా ఒకటి ’’ అని ప్రియాంకతో సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి చెప్పారు.Updated Date - 2022-01-28T00:31:14+05:30 IST