సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Priya Prakash Varrier: కన్ను గీటడంతో ట్రోల్స్, మీమ్స్‌.. భరించలేకపోయానంటున్న అందాల భామ

ABN, First Publish Date - 2022-08-12T01:23:50+05:30

‘ఒరు అడార్ లవ్’ (Oru Adaar Love)లో కన్ను గీటి ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిన అందాల భామ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier). ‘చెక్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. త్వరలోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఒరు అడార్ లవ్’ (Oru Adaar Love)లో కన్ను గీటి ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిన అందాల భామ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier). ‘చెక్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ‘లవ్ హ్యాకర్స్’ (Love Hackers)లో నటిస్తుంది. రియల్ లైఫ్ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఈ చిత్రంలో ఆమె టీనేజర్‌గా కనిపించనుంది. ప్రియా ప్రకాష్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. మొదటి సినిమా ‘ఒరు అడార్ లవ్’ లో నటించాక సైబర్ వేధింపులకు గురయ్యానని, సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నానని ప్రియ చెప్పింది.


‘ఒరు అడార్ లవ్’ లో ఓ పాటలో భాగంగా ప్రియ కన్ను గీటింది. దీంతో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. అప్పట్లో ఓ మతానికి చెందినవారి మనోభావాలను కించపరిచారంటూ ఈ చిత్ర దర్శకుడు, ప్రియకు వ్యతిరేకంగా పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇటువంటి విషయాలను ఏ విధంగా ఎదుర్కొవాలో తనకు అప్పట్లో తెలిసేది కాదని తాజాగా ప్రియ మీడియాకు తెలిపింది. ‘‘నా కెరీర్ ప్రారంభంలో నేను సెన్సేషన్‌గా మారిపోయాను. నేను కన్ను గీటిన పాటకు అనుకోకుండా విపరీతంగా పేరొచ్చింది. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలిసేది కాదు. అది అర్థం చేసుకోవడానికీ నాకు సమయం సరిపోలేదు. అప్పటికే నా మీద మీమ్స్, ట్రోల్స్, అసభ్యకర కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడం ప్రారంభమయ్యాయి. నేను వాటిని భరించలేకపోయాను. ఎందుకంటే నాకు అప్పుడు 18ఏళ్లు మాత్రమే ఉండేవి. సినీ ఇండస్ట్రీకి అప్పుడే ఎంట్రీ ఇచ్చాను. ఈ పరిస్థితులను ఏవిధంగా ఎదుర్కొవాలో నాకు మార్గదర్శనం చేసే వారు లేరు. కెరీర్ తొలినాళ్లల్లో నాకు ఈ ట్రోల్స్, మీమ్స్ ఇబ్బందికరంగా అనిపించేవి. నటులుగా మా ప్రపంచాన్ని ఇతరుల కంటె కొంచెం ఎక్కువగా చూపిస్తాం. అందువల్ల మా గురించి మీరు అసభ్య పదజాలన్ని ఉపయోగించలేరు. మమ్మల్ని అసహ్యించుకోలేరు’’ అని ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పింది. 

Updated Date - 2022-08-12T01:23:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!