Salaar Pics leak: ప్రభాస్ ఎలా ఉన్నాడో చూశారా.. నెట్టింట వైరలవుతున్న పిక్స్
ABN , First Publish Date - 2022-04-19T17:44:06+05:30 IST
‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన టాలీవుడ్ హీరో ప్రభాస్.. ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్..

‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన టాలీవుడ్ హీరో ప్రభాస్.. ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘సలార్’ అనే సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ని సాధ్యమైనంతా త్వరగా పూర్తి చేసి విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్‌లో ఆ ఎగ్జాయిట్మెంట్ ఇంకా పెరిగింది.
దీంతో ఆ సినిమా గురించి ఏ న్యూస్ వచ్చిన అది వైరల్‌గా మారడం సాధారణం అయిపోయింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్పాట్‌లోని ఫొటోలు లీక్ అయ్యాయి. అవి ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్‌గా మారాయి. అందులో.. ప్రభాస్ మాస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. వాటిని చూసి ‘కేజీఎఫ్’కి మించిన మంచి మాస్ మసాలా మూవీని ప్రభాస్‌తో ప్రశాంత్ అందించనున్నాడని పలువురు ఫ్యాన్స్ వీటిపై కామెంట్స్ చేస్తున్నారు.