సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Raj Kundra: శిల్పా శెట్టి భర్తకు వ్యతిరేకంగా ఛార్జిషీట్ నమోదు

ABN, First Publish Date - 2022-11-21T22:58:59+05:30

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా (Raj Kundra) కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా మహారాష్ట్ర సైబర్ పోలీసులు తాజాగా చార్జిషీట్‌ను దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా (Raj Kundra) కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా మహారాష్ట్ర సైబర్ పోలీసులు తాజాగా చార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఓటీటీల కోసం రెండు డీలక్స్ హోటల్స్‌లో పోర్న్ వీడియోలను షూట్ చేశాడనే అభియోగాలను అతడిపై మోపారు. రాజ్ కుంద్రాతో పాటు షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే, రాజ్ దూబే తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. ఆర్థిక లాభం కోసం వీరందరు వివిధ ఓటీటీలకు అశ్లీల కంటెంట్‌ను అందించారని ఛార్జిషీట్‌లో పోలీసులు తెలిపారు.     


రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా పోలీసులు 2019లోనే కేసును నమోదు చేశారు. వివిధ వెబ్‌సైట్స్‌కు పోర్న్ కంటెంట్ అందిస్తున్నాడని అభియోగాలను అతడిపై మోపారు. ఇండియన్ పీనల్ కోడ్‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని పలు సెక్షన్స్ కింద రాజ్ కుంద్రాపై కేసును నమోదు చేశారు. ఈ కేసులో మరో 10మందిని కూడా నిందితులుగా పేర్కొన్నారు. అనంతరం అతడిని జులై 19న ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని అర్ధర్ రోడ్డులోని జైలుకు తరలించారు. కొన్ని రోజులకు రాజ్ కుంద్రా బెయిల్‌ను కోరుతూ సెప్టెంబర్‌లో కోర్టు మెట్లెక్కాడు. మెజిస్ట్రేట్ కోర్టు రూ.50వేల పూచీకత్తు చెల్లించాలని షరతు విధిస్తూ అతడికి బెయిల్‌ను ఇచ్చింది. బెయిల్‌పై బయటకు వచ్చినప్పటి నుంచి జన జీవన సముదాయంలో రాజ్ కుంద్రా కనిపించడం లేదు. బయటకు వచ్చినప్పటికి ఎప్పుడు ఫుల్ మస్క్, హుడీతో కనిపిస్తున్నాడు.     

Updated Date - 2022-11-21T22:58:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!