Laal Singh Chaddha: కొత్త చిక్కుల్లో ఆమీర్ ఖాన్ మూవీ.. అక్కడ బ్యాన్ చేయాలంటూ పిల్

ABN , First Publish Date - 2022-08-23T22:58:06+05:30 IST

ఈ ఏడాది బాలీవుడ్‌ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మూవీస్‌లో ‘లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha)’ పేరు కచ్చితంగా..

Laal Singh Chaddha: కొత్త చిక్కుల్లో ఆమీర్ ఖాన్ మూవీ.. అక్కడ బ్యాన్ చేయాలంటూ పిల్

ఈ ఏడాది బాలీవుడ్‌ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మూవీస్‌లో ‘లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha)’ పేరు కచ్చితంగా ఉంది. బాలీవుడ్ స్టార్స్ ఆమీర్ ఖాన్ (Aamir Khan), కరీనా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో మోనా సింగ్, టాలీవుడ్ యువనటుడు నాగచైతన్య ప్రధానపాత్రలు పొషించారు. ఫస్ట్ లుక్‌ నుంచి ట్రైలర్ వరకూ విడుదలై ఈ సినిమాపై ఉన్న హైప్‌ని అమాంతం పెంచేశాయి. అయితే.. దురదృష్టవశాత్తూ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. దానికి ప్రధాన కారణం భారతదేశంలో అసహనం పెరుగుతుందంటూ ఆమీర్ ఖాన్ వ్యాఖ్యలు చేయడం. అలాగే.. కరీనా సైతం నెపోటిజంపై మాట్లాడుతూ.. మీ నచ్చకపోతే మా సినిమాలు చూడొద్దంటూ వెటకారంగా మాట్లాడడం.


ఈ రెండు సంఘటనల వల్ల కొందరు వ్యక్తులు ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేశారు. అది ఈ మూవీ ఫలితంపై ప్రభావం చూపి పెట్టిన బడ్జెట్‌లో సగం వసూళ్లు కూడా సాధించలేకపోయింది. దాని ప్రభావం ఈ సినిమా ఓటీటీ రైట్స్‌పై పడింది. సినిమా విడుదలకి ముందు ఓ ఓటీటీ(OTT) ఫ్లాట్‌ఫామ్‌తో ఈ సినిమా ప్రసారం గురించి ఆమీర్ చర్చించడంట ఆమీర్. మొదట రూ.150 కోట్ల డిమాండ్ చేసిన అనంతరం కొంచెం తగ్గి రూ.125 కోట్లైతే ఒకేనని చెప్పాడంట. అయితే.. ఆ ఫ్లాట్‌ఫామ్ యాజమాన్యం మాత్రం.. రూ.90 కోట్లను ఆఫర్ చేసింది. కానీ.. విడుదల తర్వాత ఫ్లాప్‌గా మిగలడంతో ఈ మూవీని కొనేందుకు ఓ ఓటీటీ యాజమాన్యం వెనుకడుగు వేసింది టాక్.ఇదిలా ఉండగా.. ఈ మూవీ తాజాగా లీగల్ ఇబ్బందుల్లో పడింది. నివేదికల ప్రకారం, లాల్ సింగ్ చడ్డాపై కోల్‌కతా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది. శాంతిభద్రతల కారణంగా పశ్చిమ బెంగాల్‌లో సినిమాను పూర్తిగా నిషేధించాలని అందులో కోరారు. ఆగస్టు 23న ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ కోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. బెంగాల్‌లో అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నటించిన ఈ చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని ఆ పిల్‌లో డిమాండ్ చేశారు. సినిమాలో చూపించినవి బెంగాల్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని, నిషేధం విధించలేకపోతే ప్రతి థియేటర్ వెలుపల ఒక పోలీసు అధికారిని ఉంచాలనే డిమాండ్ కూడా ఉంది. న్యాయవాది నజియా ఇలాహి ఖాన్ ఈ పిల్‌ని దాఖలు చేశారు. అంతేకాకుండా.. సినిమాలో ఆర్మీని సరైన రీతిలో చూపించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఏం జరుగుతుందో తెలియాలంటే విచారణ పూర్తయ్యే వరకూ ఆగాల్సిందే.

Updated Date - 2022-08-23T22:58:06+05:30 IST