సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన Payal Rohatgi, Sangram Singh

ABN, First Publish Date - 2022-07-11T00:11:12+05:30

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుందరి పాయల్ రోహత్గీ (Payal Rohatgi). హిందీ రియాలిటీ షో బిగ్‌బాస్‌లో పాల్గొని ఫేమ్‌ను సంపాందించుకుంది. పాయల్ 12ఏళ్లుగా రెజ్లర్ సంగ్రామ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుందరి పాయల్ రోహత్గీ (Payal Rohatgi). హిందీ రియాలిటీ షో బిగ్‌బాస్‌లో పాల్గొని ఫేమ్‌ను సంపాందించుకుంది. పాయల్ 12ఏళ్లుగా రెజ్లర్ సంగ్రామ్ సింగ్‌(Sangram Singh)తో డేటింగ్ చేస్తుంది. ఆ బంధాన్ని మరో ఎక్కించాలనుకుంది. 2014లోనే సంగ్రామ్ సింగ్‌తో నిశ్చితార్థం అయింది. ఏమైందో తెలియదు కానీ అనివార్య కారణాల వల్ల పెళ్లి మాత్రం చేసుకోలేదు. పాయల్, సంగ్రామ్ సింగ్ తాజాగా పెళ్లి చేసుకున్నారు. 


పాయల్ రోహత్గీ, సంగ్రామ్ సింగ్ జులై 9న వివాహం చేసుకున్నారు. ఈ జంట ఆగ్రాలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అంతకు ముందు పాయల్ అహ్మదాబాద్‌ ఇంటిలో మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ముందు 850ఏళ్ల చరిత్ర గల గుళ్లో ఈ జంట పూజలు చేశారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను పాయల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ షేర్ చేసిన కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారాయి. గతంలో కంగనా రనౌత్ (Kangana Ranaut) హోస్ట్ చేసిన ‘లాక్‌అప్’ షోలో పాయల్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 







Updated Date - 2022-07-11T00:11:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!