‘కేజీఎఫ్-2’ లో ఐటం సాంగ్‌గా.. ‘షోలే’ హిట్ పాట..?
ABN, First Publish Date - 2022-02-08T00:51:29+05:30
భారతీయ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘కేజీఎఫ్-2’. రాకింగ్ స్టార్ యశ్
భారతీయ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘కేజీఎఫ్-2’. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించాడు. ‘కేజీఎఫ్-1’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. పాన్ ఇండియాగా ఈ చిత్రం రాబోతోంది. ‘కేజీఎఫ్-2’లో బాలీవుడ్ తారలు సంజయ్ దత్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్‌డేట్ బాలీవుడ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.
అయితే, బాలీవుడ్ క్లాసిక్ హిట్ సాంగ్‌ను ‘కేజీఎఫ్-2’ కోసం రీమేక్ చేశారట. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘షోలే’ లోని ‘మెహబూబా..మెహబూబా’ పాటను రీమిక్స్ చేశారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ పాటలో యశ్ సరసన నోరా ఫతేహీ నర్తించిందని సమాచారం. ‘షోలే’ మూవీ 1975లో విడుదలై ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘మెహబూబా..మెహబూబా’ పాటను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ‘కేజీఎఫ్-2’ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. ‘కేజీఎఫ్-1’లోను ఒక పాటను రీమిక్స్ చేశారు. జాకీ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ‘త్రిదేవ్’ చిత్రంలోని ‘గలీ గలీ మేన్ ఫిర్తా’ పాటను చిత్ర బృందం రీమేక్ చేసింది.