సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Fire Accident: రణ్‌బీర్ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం.. ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-07-30T16:06:36+05:30

One dead in fire on set of Ranbir Kapoor film nvs spl

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లవ్ రంజన్ (Luv Ranjan) దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రద్ధా కపూర్  (Shraddha Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కోసం ముంబై సబర్బన్ అంధేరిలోని చిత్ర కూట్ గ్రౌండ్‌లో ఓ సెట్ వేశారు. ఈ మూవీ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెట్‌లో మధ్యాహ్నం 4.30 గంటలకు ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. తొలుత ఆ ప్రాంతంలోని ఒక దుకాణంలో మంటలు వచ్చినట్టు అధికారులు చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఫిల్మ్ సెట్‌లో మంటలు చెలరేగినట్టు ధ్రువీకరించారు. దట్టమైన పొగలు చట్టుపక్కల వ్యాపించడంతో మంటలను అదుపు చేసేందుకు ఐదు ఫైర్ ఇంజన్లు ,ఐదు వాటర్ జెట్టీలు రంగంలోకి దించారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు రణ్‌బీర్, శ్రద్ధా కపూర్ సినిమా సెట్‌లో లేరని సమాచారం. మంటలు చెలరేగినప్పుడు సన్నీ డియోల్ కుమారుడు రాజ్‌వీర్ డియోల్ సినిమా షూటింగ్ చిత్ర కూట్ స్టూడియోలోనే జరుగుతుందని బాలీవుడ్ మీడియా చెబుతోంది.


అయితే.. ఈ ప్రమాదంలో 32 ఏళ్ల మనీశ్ దేవాశి అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అతన్ని ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే సెట్ లైటింగ్ వర్క్ చేస్తున్న మరో వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ అశోక్ దూబే తెలిపారు. చెక్క వస్తువులను నిల్వ ఉంచిన తాత్కాలిక స్టోర్‌ రూమ్‌లో ఈ మంటలు చెలరేగాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. ఏడాదిన్నర క్రితం అగ్నికి ఆహుతైన బంగూర్ నగర్‌లో ఫిల్మ్ సెట్‌ను వేసిన కాంట్రాక్టర్ వ్యక్తి ఈ సెట్‌లను వేసినట్లు అశోక్ దూబే ఆరోపించారు.



Updated Date - 2022-07-30T16:06:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!