సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పేరెంట్స్‌ కాబోతున్న Ranbir Kapoor-Alia Bhatt.. వైరల్ అవుతున్న Rishi Kapoor పాత వీడియో.. అందులో ఏముందంటే..

ABN, First Publish Date - 2022-06-28T17:32:45+05:30

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) జంట ఒకటి. దాదాపు ఐదేళ్ల డేటింగ్ తర్వాత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) జంట ఒకటి. దాదాపు ఐదేళ్ల డేటింగ్ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 14న ఈ లవ్‌బర్డ్స్ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని తెలుపుతూ అలియా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. దీంతో ఎంతోమంది అభిమానులు, వివిధ సినీ పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.


అంతేకాకుండా.. రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ (Neetu Kapoor), సోదరి రిద్దిమా కపూర్ సైతం సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ తరుణంలో రణ్‌బీర్ తండ్రి, దివంగత నటుడు రిషీ కపూర్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అందులో.. ఆయన తండ్రి రాజ్ కపూర్‌ గురించి, భవిష్యత్తులో రణ్‌బీర్ తండ్రి అయితే ఎలా ఉంటాడో.. ఎలా ఉండాలో రిషీ కపూర్ చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘మా నాన్న రాజ్ కపూర్ మా కోసం సమయాన్ని కేటాయించలేకపోయారు. ఆయన వేరేవారి కోసం పనిచేయడం, సొంతంగా సినిమాలకు దర్శకత్వం వహిస్తుండడం, నటించడంలో బిజీగా ఉండేవారు. అందుకే ఆయన్ని చాలా మిస్ అయ్యా.


అందుకే నేను తండ్రి అయ్యాక, ఆదివారం షూటింగ్ చేయకుండా.. ఆ రోజును నా పిల్లలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ప్రతి తరంలో ఆలోచన మారుతుంది. మా నాన్న నుంచి నేను ఏమి కోల్పోయానో నాకు తెలుసు. కాబట్టి అది నా పిల్లలకు ఇవ్వాలని అనుకున్నా. అలాగే రణబీర్ నాతో ఏమి మిస్ అయ్యాడో.. అదే తన పిల్లలకు అందేలా చేస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను అతను సంప్రదాయం, సంస్కృతికి విలువిచ్చేలా పెంచాను. అలాగే.. నేను అతనికి ఎప్పుడూ తండ్రిగా ఉండాలనుకున్నా. అంతేకానీ ఫ్రెండ్‌గా కాదు. అందుకే మా మధ్య కొన్ని బౌండరీస్ ఉండేలా చూసుకున్నా’ అని చెప్పుకొచ్చారు.



Updated Date - 2022-06-28T17:32:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!