ఐఫా అవార్డ్స్‌లో Sheila Ki Jawani ని రీక్రియేట్ చేసిన నోరా ఫతేహీ

ABN , First Publish Date - 2022-06-04T22:00:12+05:30 IST

‘ఐఫా అవార్డ్స్-2022’ వేడుకలు దుబాయలోని, యాష్ ఐలాండ్‌లో జూన్ 2న ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా సల్మాన్ ఖాన్ (Salman Khan), జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline

ఐఫా అవార్డ్స్‌లో Sheila Ki Jawani ని రీక్రియేట్ చేసిన నోరా ఫతేహీ

‘ఐఫా అవార్డ్స్-2022’ వేడుకలు దుబాయ్‌లోని, యాష్ ఐలాండ్‌లో జూన్ 2న ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా సల్మాన్ ఖాన్ (Salman Khan), జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez), అనన్య పాండే (Ananya Panday), సారా అలీ ఖాన్ (Sara Ali Khan), నోరా ఫతేహీ (Nora Fatehi), షాహిద్ కపూర్ తదితరులు గ్రీన్ కార్పె‌ట్‌పై నడిచారు. ఐఫా అవార్డ్స్‌ ప్రధాన వేడుక జూన్ 4న జరగనుంది. అంతకు ఒక రోజు ముందు జూన్ 3న రాత్రి ‘ఐఫా రాక్స్-2022’(IIFA Rocks-2022) ని నిర్వహించారు. ఐఫా రాక్స్‌కు ఫరా ఖాన్, అపరక్షిత్ ఖురానా హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఈ వేడుకలోనే నోరా ఫతేహీ (Nora Fatehi) కత్రినా కైఫ్ హిట్ సాంగ్ ‘షీలాకీ జవానీ’ని రీక్రియేట్ చేశారు. ‘షీలా కీ జవానీ’ పాట బాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ‘తీస్ మార్ ఖాన్’ సినిమాలోనిది. ఈ చిత్రానికీ ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు. ఐఫా రాక్స్‌లో నేహా కక్కర్, హానీసింగ్ కూడా తమ ప్రదర్శనలతో అదరగొట్టారు. 


ఐఫా అవార్డ్స్ ప్రధాన వేడుక జూన్ 4న జరగనుంది. మెయిన్ ఈవెంట్‌కు సల్మాన్ ఖాన్, రితేశ్ దేశ్ ముఖ్, మనీశ్ పాల్ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. ప్రధాన వేడుకలో వరుణ్ ధావన్, అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మిథున్ చక్రవర్తి, బోనీ కపూర్, మాదురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, తమన్నా, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్, సాన్యా మల్హోత్రా తదితరులు హాజరు కానున్నారు.

Updated Date - 2022-06-04T22:00:12+05:30 IST

Read more