సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

18 ఏళ్ల వయసులో Priyanka Chopra ఎలా ఉందో చూశారా..? నెట్టింట వైరల్‌గా మారిన హాట్ పిక్..!

ABN, First Publish Date - 2022-06-10T17:14:01+05:30

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ప్రియాంక చోప్రా. ఇక్కడ కెరీర్‌ పిక్‌లో ఉండగానే హాలీవుడ్‌లో అడుగుపెట్టి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra). ఇక్కడ కెరీర్‌ పిక్‌లో ఉండగానే హాలీవుడ్‌ (Hollywood)లో అడుగుపెట్టి.. అక్కడ సైతం మంచి గుర్తింపు సాధించింది. వరుసగా వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చేస్తూ గ్లోబల్ నటిగా గుర్తింపు పొందింది. కొన్నేళ్ల క్రితం అక్కడే తనకంటే వయస్సులో దాదాపు 10 ఏళ్లు చిన్నవాడైన ప్రముఖ హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనాస్‌ (Nick Jonas)ని వివాహం చేసుకుంది. వారికి సరోగసీ ద్వారా ఇటీవలే మాల్తి మేరీ చోప్రా జోనాస్ అనే కూతురు పుట్టింది. 


అయితే, తాజాగా ప్రియాంక సోషల్ మీడియాలో ఓ ఫొటోని షేర్ చేసింది. అది 2000లో.. అంటే ప్రియాంక 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ బికినీ యాడ్ కోసం దిగిన పిక్. దానికి ‘నవంబర్ 2000. నేను పద్దెనిమిది ఏళ్ల వయసులో ఉన్న హాట్ పిక్’ అంటూ రాసుకొచ్చింది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లతో పలువురు సెలబ్రిటీలు సైతం స్పందించారు. బాలీవుడ్ యువ నటుడు రణ్‌వీర్ సింగ్ అయితే.. ‘బ్రో’ అంటూ కామెంట్ పెట్టగా.. దానికి ప్రియాంక ‘బడ్డీ (మిత్రమా)’ అని రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా.. కొందరు నెటిజన్లు సైతం.. ‘ప్రియాంక అప్పుడూ ఇప్పుడూ దేవతే’, ‘చాలా బాగున్నావు’, ‘నువ్వు ఎప్పుడూ రాణివే’ అంటూ వరుస కామెంట్స్ చేస్తున్నారు. ఆ వైరల్ పిక్‌ని మీరో ఓ సారి చూసేయండి..



Updated Date - 2022-06-10T17:14:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!