త్వరలో అంబానీల ఇంట మరో రాయల్ వెడ్డింగ్.. అటెండ్ కానున్న బాలీవుడ్ సెలబ్రిటీలు!
ABN , First Publish Date - 2022-01-25T16:09:25+05:30 IST
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లి వేడుకని ఎంత ఘనంగా నిర్వహించారో అందరికి తెలిసిందే...
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లి వేడుకను ఎంత ఘనంగా నిర్వహించారో అందరికి తెలిసిందే. 2018లో ఆనంద్ పిరమల్‌తో ఎంతో ఆడంబరంగా జరిగిన మ్యారేజ్ కోసం ఆ కుంటుంబం వందల కోట్లను ఖర్చు చేసిందని వార్తలొచ్చాయి. తాజాగా ఆ ఫ్యామిలీ మరో రాయల్ వెడ్డింగ్‌కు సిద్ధమవుతోంది. అదే అనిల్ అంబానీ కొడుకు జై అన్మోల్ అంబానీది.
అన్మోల్, క్రిషా షా అనే బిజినెస్ వుమెన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు నెలక్రితమే జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా వీరి ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలను పొలిటిషియన్ సుప్రియ సులే పోస్ట్ చేయగా.. అంబానీ కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. దీంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇషా అంబానీ పెళ్లిలాగే ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు వీరి మ్యారేజ్‌కి సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి ఎవరెవరు రావాల్సి ఉందన్న లిస్ట్‌ను ఫైనల్ చేసే పనిలో ప్రస్తుతం అనిల్ అంబానీ కుంటుంబం ఉందట.