తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-11-24T14:16:00+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా నవంబర్ 23న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


ది స్విమ్మర్స్ (The Swimmers)

ది స్విమ్మర్స్ అనేది 2022లో సాలీ ఎల్ హోసైనీ దర్శకత్వం వహించిన బయోపిక్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో నథాలీ ఇస్సా, మనల్ ఇస్సా, అహ్మద్ మాలెక్, మథియాస్ ష్వీఘోఫర్, అలీ సులిమాన్, కిండా అల్లౌష్, జేమ్స్ కృష్ణ ఫ్లాయిడ్, ఎల్మీ రషీద్ ఎల్మీ నటించారు.టీనేజ్ ఒలింపియన్ శరణార్థి, యుస్రా మర్దిని కథ ఈ చిత్రం. ఆమె తన సోదరి సారాతో కలిసి శరణార్థులను ఏజియన్ సముద్రం మీదుగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళుతుంది. ఈ తరుణంలో ఆ సిస్టర్స్ ఎదురయ్యే సమస్యల సమాహారమే ది స్విమ్మర్స్. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


క్రిస్మస్ ఆన్ మిస్టేల్‌టో ఫామ్‌ (Christmas on Mistletoe Farm)

క్రిస్మస్ సమయంలో వారసత్వంగా పొందిన పొలాన్ని  తర్వాత తండ్రి జీవించడానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తాడు.  అతని పిల్లలు ఎప్పటికీ అక్కడే ఉండేందుకు ప్రణాళిక వేసుకుంటారు. ఈ తరుణంలో వారికి ఎదురైన సంఘటనల సమాహారమే క్రిస్మస్ ఆన్ మిస్టేల్‌టో ఫామ్‌. ఈ మూవీలో స్కాట్ గార్న్‌హామ్, స్కాట్ పైగే, కాథరిన్ డ్రైస్‌డేల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.






నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Blood, Sex & Royalty - ఇంగ్లిష్

Taco Chronicles Cross the Border - స్పానిష్

Who's a Good Boy? - స్పానిష్

The Unbroken Voice - స్పానిష్

Lesson Plan - పొలిష్


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Kendrick Lamar's The Big Steppers Tour: Live from Paris - ఇంగ్లిష్

Good Night Oppy - ఇంగ్లిష్


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Welcome to Chippendales - ఇంగ్లిష్

Updated Date - 2022-11-24T14:16:00+05:30 IST

Read more